లేడీ సూపర్ స్టార్ నయనతారకు తమిళంలో ఎంత భారీ ఫాలోయింగ్ ఉన్నా తెలుగులో మాత్రం తక్కువే. ముఖ్యంగా తనను సోలో హీరోయిన్ గా చూసేంత రేంజ్ లో మార్కెట్ లేదని గతంలో చాలా డబ్బింగ్ సినిమాలు ఋజువు చేశాయి. అయినా నిర్మాతలు కొత్త కొత్త సబ్జెక్టులలో నయన్ ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. వాటిలో భాగంగా వచ్చిందే కనెక్ట్. భర్త విఘ్నేష్ శివన్ ప్రొడక్షన్ పార్ట్ నర్ కావడంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తెలుగులోనూ ఇంటర్వ్యూ ఇవ్వడం ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. ఇవాళే ఈ కనెక్ట్ థియేటర్లలో అడుగు పెట్టింది. కనీస ఓపెనింగ్స్ కరువైన ఈ హారర్ థ్రిల్లర్ ఎలా ఉందనే ఆసక్తి కలగడం సహజం.
స్టోరీ పరంగా చూస్తే గతంలో ఎన్నడూ చూడనిది అయితే కాదు. దర్శకుడు అశ్విన్ శరవణన్ ఓ క్రిస్టియన్ ఫ్యామిలీ చుట్టూ కథను అల్లుకున్నాడు. కరోనా టైంలో ఆ వ్యాధి బారిన పడిన జోసెఫ్(వినయ్ రాయ్)దాని వల్లే ప్రాణాలు కోల్పోతాడు. దీంతో కూతురు అన్నా(హానియా నఫీస్) షాక్ కు గురై వింతగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది. భర్త, కూతురుకి ఇలా జరగడంతో సుసాన్( నయన తార) తల్లడిల్లిపోతుంది. లాక్ డౌన్ వల్ల ఒకే ఇంట్లో వేర్వేరు గదుల్లో తల్లీకూతుళ్లు ఉంటారు. జోసెఫ్ ఆత్మతో మాట్లాడేందుకు ప్రయత్నించిన అన్నాను దెయ్యం ఆవహిస్తుంది. ఆ తర్వాత జరిగేదే కనెక్ట్ లో చూడాల్సిన కథ.
ఇటీవలే వచ్చిన మసూద, ఆ మధ్య ఆహాలో చూసిన అన్య ట్యుటోరియల్స్ లాంటివి చూసినవాళ్లకు కనెక్ట్ లో మరీ కొత్తదనం ఏమి కనిపించదు. కేవలం ఒక ఇంట్లో భయానక వాతావరణాన్ని సృష్టించి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో భయపెట్టే ప్రయత్నంలో అశ్విన్ కొంతమేరకు సక్సెస్ అయ్యాడు కానీ మరీ ఎడ్జ్ అఫ్ ది సీట్ రేంజ్ లో మలచలేదు. కొన్ని సీన్స్ నిజంగానే హారర్ పుట్టిస్తే మరికొన్ని రెగ్యులర్ గానే తోస్తాయి. 99 నిమిషాలకే పరిమితం చేయడం వల్ల డిటైలింగ్ తగ్గింది. అప్పుడే అయిపోయిందానే భావన అసంతృప్తిని కలిగిస్తుంది. నయన్, సత్యరాజ్, నఫీస్ ల నటన బాగుంది. హార్డ్ కోర్ దెయ్యాల ఫ్యాన్స్ అయితేనే కనెక్ట్ ని ఛాయస్ గా పెట్టుకోవచ్చు.
This post was last modified on December 22, 2022 7:31 pm
తెలంగాణ హనుమకొండలోని అదాలత్ సెంటర్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ ఆటోడ్రైవర్‌ను కత్తితో దాడి…
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్‌లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…