తెలుగులో చాలామంది స్టార్ హీరోలతో సినిమాలు చేసింది నయనతార. నిన్నటితరం సూపర్ స్టార్లు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లతోనే కాక.. కొత్త తరం స్టార్లు ప్రభాస్, ఎన్టీఆర్‌లతోనూ ఆమె జోడీ కట్టింది. ఐతే ఆమె తన సినిమాల ప్రమోషనల్ ఈవెంట్లకు రావడం, ఇంటర్వ్యూలివ్వడం చేయదు కాబట్టి.. ఆయా హీరోల గురించి తన ఒపీనియన్ ఏంటో వినే అవకాశమే లేకపోయింది. ఐతే తన కొత్త చిత్రం ‘కనెక్ట్’ కోసం తన కట్టుబాట్లు పక్కన పెట్టి వీడియో ఇంటర్వ్యూలు ఇచ్చింది నయన్. తమిళంలో డీడీ అనే యాంకర్‌తో, తెలుగులో సుమతో ఆమె ఇంటర్వ్యూలు చేసింది. ఈ సందర్భంగా తెలుగులో తాను నటించిన స్టార్ల గురించి తన అభిప్రాయాలను వెల్లడించింది నయన్.
ముందుగా తెలుగులో తన తొలి చిత్రం అయిన ‘లక్ష్మీ’తో పాటు ‘తులసి’, ‘బాబు బంగారం’ చిత్రాల్లో తనతో జోడీ కట్టిన వెంకటేష్ గురించి మాట్లాడుతూ.. ‘‘ఆయన తెలుగులో నా తొలి హీరో. మేమిద్దరం తర్వాత కూడా కలిసి సినిమాలు చేశాం. ఆయనతో సెట్లో ఉంటే ఫ్యామిలీతో ఉన్నట్లే ఉంటుంది. ఒక పెద్ద హీరోతో నటిస్తున్నాననే ఫీలింగే కలగదు’’ అని చెప్పింది. ‘బాస్’లో కలిసి నటించిన నాగార్జున గురించి ఒక్క మాటలో చెప్పమంటే ‘‘అందగాడు’’ అని సింపుల్‌గా తేల్చేసింది నయన్.
సైరా, గాడ్ ఫాదర్ చిత్రాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్న చిరంజీవి గురించి అడిగితే.. ‘‘ఆయన టాప్ స్టార్ అయినప్పటికీ స్టార్ డమ్ చూపించరు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం ఆయనది. నటీనటులను జాగ్రత్తగా చూసుకుంటారు’’ అంది. ‘దుబాయ్ శీను’ కోస్టార్ రవితేజ గురించి మాట్లాడుతూ.. ‘‘తను నేను బెస్ట్ ఫ్రెండ్స్. మేమిద్దరం ఇప్పటికీ స్నేహితులమే కానీ ఇద్దరం ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయిపోవడం, ఈ మధ్య కలవకపోవడం వల్ల మాటలు తగ్గిపోయాయి. సెట్లో ఉన్నపుడు మేమిద్దరం హిందీలోనే మాట్లాడుకునేవాళ్లం’’ అని చెప్పింది నయన్.
‘యోగి’లో తనతో నటించిన ప్రభాస్ గురించి చెబుతూ.. అతనో స్వీట్ హార్ట్ అన్న ఆమె.. తను పెద్ద స్టార్ కావడం పట్ల చాలా సంతోషంగా ఉందని చెప్పింది. ఇక ఎన్టీఆర్‌తో తన సరదా అనుభవం గురించి చెబుతూ.. ‘‘ఒకసారి నేను సెట్లో రెడీ అవుతుంటే.. తను నన్ను చూస్తూ ఎందుకంత మేకప్ వేసుకుంటావని అడిగాడు. షాట్‌కు వెళ్లాలి కదా అంటే.. నేను స్క్రీన్ మీద ఉన్నపుడు నన్నే చూస్తారు. నువ్వు రెడీ అవ్వాల్సిన అవసరం ఏముంది’’ అంటూ జోక్ చేసినట్లు నయన్ వెల్లడించింది. బాలయ్య గురించి చెబుతూ.. ఆయనతో మాట్లాడడానికి అందరూ భయపడతారు కానీ, చాలా ప్రశాంతంగా ఉంటారని, సరదాగా మాట్లాడతారని నయన్ అభిప్రాయపడింది.
This post was last modified on December 22, 2022 9:33 am
ఈమధ్య AI టెక్నాలజీతో హాట్ టాపిక్ గా నిలిచిన చైనా టారిఫ్ వార్ తో కూడా అమెరికాతో పోటీ పడడం…
తెలుగులో ఒకప్పుడు వెలుగు వెలిగిన నిర్మాతలు చాలామంది కనుమరుగైపోయారు. కానీ అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి కొద్ది మంది…
అగ్రరాజ్యం అమెరికా కొత్తగా సుంకాల పెంపు కారణంగా ఏపీలో ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం పడినా... కూటమి సర్కారు తీసుకున్న…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ తో కలిసి…
ఒకప్పుడు తమిళ డబ్బింగ్ సినిమాలను చూసి తెలుగులో ఇలాంటి సినిమాలు రావేంటి అని చాలా ఫీలయ్యేవాళ్లు మన ప్రేక్షకులు. అక్కడ ఎన్నో కొత్త…
మాస్ రాజా రవితేజకు గత కొన్నేళ్లలో పెద్ద హిట్ అంటే.. ధమాకానే. ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుని కూడా బ్లాక్ బస్టర్…