ఇప్పటిదాకా తెలుగులో చాలా సినిమాల్లో నటించింది నయనతార. ఐతే ఒక్క శ్రీరామరాజ్యం సినిమా వేడుకలో తప్ప ఇంకే ప్రమోషనల్ ఈవెంట్లోనూ ఆమె కనిపించింది లేదు. అది కూడా తనకు చివరి సినిమాగా భావించి ఆ వేడుకకు వచ్చింది. దానికి ముందు ఆమె ఎప్పడూ ప్రమోషన్లలో పాల్గొన్నది లేదు. తమిళంలో కూడా చాలా సినిమాల ప్రమోషన్లకు ఆమె దూరంగా ఉంది.
నటించడం వరకే తన పని అని, ప్రమోషన్లకు రాను అని ముందే తాను చెప్పేస్తానన్నది ఆమె వాదన. అలా అని ఆమె ఏ సినిమానూ ప్రమోట్ చేయదా అంటే అదేం లేదు. తన భర్త విఘ్నేష్ శివన్ డైరెక్షన్లో లేదా నిర్మాణంలో తెరకెక్కే సినిమాలు, అలాగే కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు మాత్రం ఆమె ప్రమోషన్లు చేస్తుంటుంది. తాజాగా విఘ్నేష్ ప్రొడక్షన్లోనే తెరకెక్కిన కనెక్ట్ సినిమాను అటు తమిళంలో, ఇటు తెలుగులో ఆమె ప్రమోట్ చేస్తోంది.
తెలుగులో యాంకర్ సుమతో ఆమె ప్రమోషనల్ ఇంటర్వ్యూ చేసింది. ఐతే ఈ ఇంటర్వ్యూ చూశాక వచ్చే కౌంటర్లను ముందే ఊహించి తాను ప్రమోషన్లు చేయని విషయంలో ప్రశ్నలు అడిగించుకుంది నయన్. ఎందుకు సినిమా వేడుకల్లో, ఇంటర్వ్యూల్లో పాల్గొనరు అని అడిగితే.. తాను ఎప్పట్నుంచో సుమతోనే ఇంటర్వ్యూ చేయాలని చూస్తున్నానని.. కానీ ఆమె బిజీగా ఉండడంతో వేరే వాళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడం ఇష్టం లేక చేయలేదని నవ్వుతూ చెప్పింద నయన్.
మరి గాడ్ ఫాదర్ సినిమా సక్సెస్ మీట్లో కూడా ఎందుకు పాల్గొనలేదు అని అడిగితే.. అప్పుడు తాను ఫారిన్లో ఉన్నట్లు వెల్లడించింది. కానీ ఇది జస్ట్ కవరింగ్ అని ఎవరికైనా అర్థమైపోతుంది. నయన్ ఒప్పుకుంటే సుమతో ఎప్పుడో ఇంటర్వ్యూలు చేయించేవారు మన నిర్మాతలు. అలాగే ఆమె ఇండియాలో ఉండగా ఇక్కడ ఎన్నో ఈవెంట్లు జరిగాయి. అందులో వేటికీ ఆమె హాజరవకపోవడాన్ని ఎలా సమర్థించుకుంటుందో మరి?
This post was last modified on December 22, 2022 6:19 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…