టాలీవుడ్ లో ఆ మధ్య కొంచెం గ్యాప్ చూసిన అనుపమ పరమేశ్వరన్ కు ఈ ఏడాది కార్తికేయ 2 రూపంలో బ్లాక్ బస్టర్ పడ్డాక మళ్ళీ ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది. ఎల్లుండి విడుదల కాబోతున్న 18 పేజెస్ మీద సైతం కాన్ఫిడెంట్ గా ఉంది. నిఖిల్ జోడి మరోసారి రిపీట్ కావడంతో ఫ్యాన్స్ హిట్ సెంటిమెంట్ ని ఫీలవుతున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ మరీ దూకుడుగా లేవు కానీ ట్రైలర్ వచ్చాక డీసెంట్ బజ్ అయితే కనిపిస్తోంది. టాక్ కీలకంగా వ్యవహరించే ఇలాంటి సినిమాలకు ఓపెనింగ్స్ పెద్ద అద్భుతాలు చేయవు కానీ బాగుందనే మాట బయటికి వస్తే చాలు ఆటోమేటిక్ గా జనాలు థియేటర్లకు వచ్చేస్తారు.
దీని ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతున్న అనుపమకు డీజే టిల్లు 2కి సంబంధించిన టాపిక్ డిస్కషన్ కు వచ్చినప్పుడు ఆ ఒక్కటి అడగొద్దని స్కిప్ కొట్టేసింది. షూటింగ్ ప్రారంభానికి ముందు ఓకే చెప్పి తర్వాత ఏవో కారణాల వల్ల బయటికి వచ్చి తిరిగి మళ్ళీ జాయిన్ కానున్నారనే వార్త నిన్నటి నుంచి చక్కర్లు కొడుతోంది. దాని గురించే అడిగితే దాటవేత సమాధానం తప్ప క్లారిటీ ఇవ్వలేదు. ఇది కేవలం 18 పేజెస్ కు సంబంధించిన ఇంటరాక్షన్ కాబట్టి దీని గురించి తర్వాత మాట్లాడుదాం అని తేల్చేసింది. స్పష్టంగా నేను అందులో లేనని చెప్పలేదంటే ఇన్ డైరెక్ట్ గా ఉన్నట్టేనని ఒప్పుకున్నట్టా?
దీని తర్వాత అనుపమ నటించిన బటర్ ఫ్లై త్వరలో హాట్ స్టార్ ద్వారా నేరుగా ఓటిటి రిలీజ్ జరుపుకోనుంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈగల్ లోనూ జోడి కట్టనుంది. ఇవి కాకుండా సైరన్ అనే తమిళ మూవీ నిర్మాణంలో ఉంది. డీజే టిల్లు స్క్వేర్ కనక కన్ఫర్మ్ అయితే మళ్ళీ ఈ లిస్టులోకి చేర్చుకోవచ్చు. మలయాళంలోనూ జెఎస్కె తన చేతిలోనే ఉంది. గత ఏడాది రౌడీ బాయ్స్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయినా ఈ సంవత్సరం కార్తికేయ 2తో వచ్చిన సక్సెస్ ఇప్పుడీ 18 పేజెస్ తో కంటిన్యూ అయితే కెరీర్ ని మళ్ళీ సెట్ చేసుకోవచ్చు. ఎలాంటి ఫలితం దక్కుతుందో మరి.
This post was last modified on December 21, 2022 1:59 pm
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…