బాలీవుడ్లో ఈ మధ్య మెరుపులు బాగా తగ్గిపోయాయి. నార్త్ మార్కెట్‌ను దున్నేస్తున్న సౌత్ సినిమాలను చూసి కంగారు పడుతూ తాము ఎలాంటి సినిమాలు తీయాలో తెలియక సతమతం అవుతున్నారు. ఇలాంటి టైంలో కొన్ని సినిమాలు మాత్రం వారిలో ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఈ మధ్య అజయ్ దేవగణ్ సినిమా ‘దృశ్యం-2’ చాలా మంచి ఫలితాన్ని అందుకుంది. ఆ తర్వాత వచ్చిన సినిమాలు మాత్రం యథాప్రకారమే బోల్తా కొట్టేశాయి.
ఇప్పుడు బాలీవుడ్‌లో మళ్లీ ఆశలు రేకెత్తిస్తున్న సినిమాల్లో ‘కుత్తే’ ఒకటి. అర్జున్ కపూర్, టబు, రాధికా మదన్, నసీరుద్దీన్ షా ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్ర ట్రైలర్ తాజాగా లాంచ్ అయింది. అది ఇన్‌స్టంట్ హిట్టయిపోయి ప్రేక్షకుల్లో సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది. ఈ మధ్య కాలంలో బెస్ట్ ట్రైలర్ కట్‌గా దీన్ని క్రిటిక్స్ అభివర్ణిస్తున్నారు. ఆ ట్రైలర్ చూస్తే ఈ మాట నిజమే అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే.
చాప్టర్-1 అంటూ ముందుగా పాత్రల పరిచయం.. చాప్టర్-2 అంటూ తర్వాత కథ గురించి హింట్ ఇవ్వడం.. ఇలా ఆసక్తికరంగా ట్రైలర్ కట్ చేశారు. కథ పరంగా చూసుకుంటే ఇది కొత్తదేమీ కాదు. అటవీ ప్రాంతంలో మూణ్నాలుగు కోట్ల డబ్బుతో ఓ వ్యాన్ వెళ్తోందని.. దాన్ని కొట్టేద్దామని వేర్వేరు వ్యక్తులు ప్లాన్ చేసుకుని రంగంలోకి దిగడం.. అక్కడ వారికి ఎదురయ్యే అనుభవాలు.. వీళ్లు వెళ్లేసరికే ఆ డబ్బును వేరొకరు కొట్టేయడం.. తర్వాత వీరిలో పరస్పర గొడవలు.. ఈ నేపథ్యంలో నడిచే కథ ఇది.
దొంగా దొంగా, క్షణక్షణం లాంటి సినిమాలో ఎప్పుడో ఈ టైపు స్టోరీలు చూశాం. కాకపోతే ట్రీట్మెంట్ కొంచెం భిన్నంగా, పూర్తి ఎంటర్టైనింగ్‌గా ఉన్నట్లు కనిపిస్తోంది ‘కుత్తే’లో. ట్రైలర్ మాత్రం భలేగా కట్ చేశారు. నాన్ స్టాప్ ఎంటర్టైనర్ ఇదనే సంకేతాలు ఇచ్చారు. ‘కుత్తే’ అనే టైటిల్‌కు తగ్గట్లే పాత్రలన్నింటిదీ కుక్కల మనస్తత్వమే అన్నట్లు ట్రైలర్లో చూపించడం విశేషం. అర్జున్‌తో పాటు టబు, రాధికా ట్రైలర్లో బాగా హైలైట్ అయ్యారు. అస్మాన్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 13న ప్రేక్షకుల ముదుకు రానుంది.
This post was last modified on December 21, 2022 1:45 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…