లేడీ సూపర్ స్టార్ గా అభిమానులు పిలుచుకునే నయనతార తను నటించే సినిమాలో ఎంత పెద్ద స్టార్ ఉన్నా సరే ప్రమోషన్లకు రాదన్న విషయం మీడియాకే కాదు సగటు సామాన్య ప్రేక్షకులకూ తెలుసు. గాడ్ ఫాదర్ అంటే అప్పుడేదో హానీమూన్, పిల్లల హడావిడి అనుకోవచ్చు కానీ అంతకు ముందు అదే చిరంజీవితో సైరా నరసింహారెడ్డిలో నటించినప్పుడూ ముంబై నుంచి హైదరాబాద్ దాకా ఏ ఒక్క ఈవెంట్ లోనూ తను కనిపించలేదు. బాలయ్యతో జైసింహా చేసినా ట్రీట్ మెంట్ లో మార్పు ఉండదు. శ్రీరామరాజ్యం టైంలో మాత్రమే కొంచెం బయట కనిపించింది కానీ ప్రభాస్, తారక్ ఎవరితో జోడి కట్టినా తన ధోరణి ఎప్పుడూ ఒక్కటే.
కానీ విచిత్రంగా కొత్త మూవీ కనెక్ట్ విషయంలో మాత్రం దీనికి మినహాయింపు ఇచ్చింది. ఎన్నడూ లేనిది అచ్చ తెలుగులో సుమకో స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో ఆ చిత్రం విశేషాలతో పాటు టాలీవుడ్ హీరోలతో తన అనుభవాలు, వాళ్ళ వ్యక్తిత్వాల గురించి పొగడ్తలు కురిపించింది. ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే. కనెక్ట్ కేవలం తొంభై తొమ్మిది నిమిషాల చిన్న సినిమా. అది కూడా ఇంటర్వెల్ లేకుండా ఏకధాటిగా సాగుతుంది. పైగా కాన్సెప్ట్ కూడా మరీ కొత్తదేం కాదు. లాక్ డౌన్ టైంలో ఒంటరిగా ఉన్న వ్యక్తుల జీవితాల్లో దెయ్యం వస్తే ఎలా ఉంటుందన్న పాయింట్ తో రూపొందింది.
సరే దాని రిజల్ట్ ఎలా ఉంటుందన్నది రేపు తేలుతుంది కానీ నయన్ లో ఈ మార్పు కేవలం కనెక్ట్ కే పరిమితమా లేక ఇకపై చేయబోయే వాటికి కూడా వర్తిస్తుందన్నది చూడాలి. అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న రాజమౌళి లాంటి దర్శకుడే ప్రమోషన్ కోసం దేశ విదేశాలు తిరుగుతున్న ట్రెండ్ లో నా పద్ధతి నాదే అనే తరహాలో నయనతార వ్యవహరించిన శైలి ఇకపై సాగకపోవచ్చు. అసలే పెళ్ళై బిడ్డల తల్లిగా మారాక ఆఫర్లలో హెచ్చు తగ్గులు సహజంగా ఉంటాయి. వాటిని బ్యాలన్స్ చేయడం చాలా కష్టం. కొందరు మాత్రమే దీన్ని నెగ్గుకురాగలిగారు. ,మరి నయన్ ప్లానింగ్ ఎలా ఉంటుందో
This post was last modified on December 21, 2022 11:22 am
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…