టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత గురించి ఈ మధ్య ఎక్కువగా నెగెటివ్ న్యూస్‌లే వినిపిస్తున్నాయి. ఆమె అనారోగ్యం గురించి ఎక్కువ చర్చ నడుస్తుండగా.. ఆ ప్రభావం తన సినిమాల మీద కూడా ప్రతికూల ప్రభావమే చూపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆల్రెడీ విజయ్ దేవరకొండతో సమంత చేస్తున్న ఖుషి మూవీ షూటింగ్ తన అనారోగ్యం కారణంగానే ఆగిన సంగతి తెలిసిందే.
ఐతే సమంత కోలుకోవడానికి చాలా టైం పడుతుందని, ఇప్పట్లో ఈ షూటింగ్ మొదలు కాదని ఓ ప్రచారం నడుస్తుండగా..అది చాలదన్నట్లుసమంత నటించాల్సిన హిందీ సినిమాలకు కూడా బ్రేక్ పడిందని.. ఆ సినిమాల నుంచి సమంతను తప్పిస్తున్నారని కొత్త రూమర్లు ఊపందుకున్నాయి. రోజు రోజుకూ ఇలాంటి వార్తలు పెరిగిపోతుండడంతో సమంత టీం స్పందించింది. ఆమె గురించి జరుగుతున్న ప్రచారం అబద్ధమంటూ తన మేనేజర్ మీడియాకు క్లారిటీ ఇచ్చాడు.
సమంత ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటోందని.. సంక్రాంతి తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి షూటింగ్‌లో పాల్గొంటుందని సమంత ప్రతినిధి మీడియాకు స్పష్టం చేశారు. ఆ సినిమా అయ్యాక సమంత ఒప్పుకున్న బాలీవుడ్ సినిమాలకు పని చేస్తుందన్నాడు. జనవరి నుంచే సమంత ఒక హిందీ సినిమా షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉండగా.. ఖుషి మూవీ ఆలస్యం కావడం వల్ల ఇది కూడా లేటవుతోందని.. ఏప్రిల్-మే నెలల నుంచి ఆమె బాలీవుడ్ చిత్రాలకు పని చేయొచ్చని అతను తెలిపాడు.
సినిమా షూటింగ్ కోసం నెలల పాటు నిర్మాతలు వేచి చూసేలా చేయడం భావ్యం కాదని.. ఇలా వేచి చూడలేకపోతే ప్రత్యామ్నాయాలు చూసుకోవచ్చని సమంత తన నిర్మాతలకు చెప్పిందని.. ఐతే తాను సైన్ చేసిన ఏ ప్రాజెక్టుకూ సమంత దూరం కాలేదని.. ఆమె గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా అబద్ధమని తన ప్రతినిధి స్పష్టం చేశారు.
This post was last modified on December 20, 2022 10:15 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…