‘అవతార్-2’ సినిమా మీద ఉన్న అంచనాల ప్రకారం చూస్తే ప్రపంచవ్యాప్తంగా సినిమా వసూళ్ల రికార్డులన్నీ బద్దలైపోతాయనే అనుకున్నారంతా. కానీ రిలీజ్ దగ్గర పడేసరికి హైప్ కొన్ని కారణాల వల్ల తగ్గిపోయింది. అందుకు ట్రైలర్ అంచనాలకు తగ్గట్లు లేకపోవడం ఒక కారణం కావచ్చు. దీనికి తోడు ప్రిమియర్ల నుంచి మిక్స్‌డ్ టాక్ రావడం కూడా మైనస్ అయింది. ఇక రిలీజ్ రోజు కూడా టాక్ అందుకు తగ్గట్లే వచ్చింది. ఉన్నంతలో మెరుగైన వసూళ్లే సాధించినప్పటికీ.. ఓవరాల్‌గా మాత్రం సినిమా అంచనాలను అందుకోలేకపోయింది.
వీకెండ్ అయ్యేసరికి ఈ చిత్రం 450 మిలియన్లకు అటు ఇటుగా వసూళ్లు రాబట్టింది. మామూలుగా చూస్తే ఇది చాలా పెద్ద ఫిగర్ కానీ.. ‘అవతార్-2’ స్థాయికి మాత్రం వసూళ్లు చాలా తక్కువే. రికార్డుల లెక్కలు తీస్తే ‘ఎవెంజర్స్: ది ఎండ్‌గేమ్’ను బీట్ చేయకపోగా.. చాలా చిత్రాల కంటే ‘అవతార్-2’ వెనుకబడింది.
ఈ ప్రభావం ‘అవతార్-2’ నిర్మాణ భాగస్వామి, డిస్ట్రిబ్యూటర్ అయిన డిస్నీ సంస్థ మీద బాగానే పడింది. ఆ సంస్థ షేర్లు మార్కెట్లూ బాగా పతనం అవుతుండడమే ఇందుకు సూచిక. 52 వారాల లో లెవల్‌కి ‘డిస్నీ’ షేర్లు పడిపోవడం గమనార్హం. ఆల్రెడీ డిస్నీ షేర్లు కొంచెం దెబ్బ తినగా ‘అవతార్-2’ బాక్సాఫీస్ బ్యాడ్ పెర్ఫామెన్స్ ప్రతికూల ప్రభావం చూపింది. ఆ మధ్య ‘బ్రహ్మాస్త్ర’ సినిమాకు డివైడ్ టాక్ రాగానే పీవీఆర్ సంస్థ షేర్లు పడిపోవడం తెలిసిందే. ఇది కూడా అలాంటిదే.
వీకెండ్ వరకు ‘అవతార్-2’ జోరు చూపించినా.. ఆ తర్వాత వసూళ్లు పడిపోయాయి. ఇండియాలో తెలుగు రాష్ట్రాల్లో మినహా ఎక్కడా ఆక్యుపెన్సీ ఆశించిన స్థాయిలో లేదు. వరల్డ్ వైడ్ ఈ సినిమా 2 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.16 వేల కోట్లు) సాధిస్తే తప్ప బ్రేక్ ఈవెన్ అవ్వదు. కానీ ప్రస్తుత ఫామ్ చూస్తుంటే ఫుల్ రన్ వసూళ్లు 1.5 బిలియన్ డాలర్ల మార్కును కూడా అందుకోవడం కష్టమే అనిపిస్తోంది.
This post was last modified on December 20, 2022 5:37 pm
యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత భారీ ప్రాజెక్టుల మీద దృష్టి సారిస్తున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి…
ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీ..ఇంకా పాఠాలు నేర్చుకున్న ట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా…
ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో వచ్చాక దేవర 2 ఉంటుందా లేదా అనే దాని గురించి డిస్కషన్లు ఎక్కువయ్యాయి. డిజిటల్…
ఏపీ సీఎం చంద్రబాబు తన మంత్రులను డిజప్పాయింట్ చేసేశారు. అదేంటి అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది వ్యూహం. తాజాగా అసెంబ్లీలో ప్రవేశ…
ఒకప్పుడు థియేటర్‌లో సినిమా చూస్తూ దోమలు కుడుతున్నా, తెరమీద బొమ్మ మసకమసకగా కనిపించినా ప్రేక్షకులు సర్దుకుపోయేవాళ్లు. ఇష్టమైన యాక్టర్ల నటన…
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తో వైఎస్ షర్మిల సంబంధం ఉందని సోషల్ మీడియాలో చాలాకాలంగా దుష్ప్రచారం జరుగుతోన్న సంగతి…