కొత్త సినిమాలకు మంచి రిలీజ్ డేట్ కనిపించినపుడు.. ఒకేసారి మూణ్నాలుగు సినిమాలు పోటీకి సై అనడం చూస్తూనే ఉంటాం. ఇలా పోటీ పడటం వల్ల ఒక సినిమా కలెక్షన్లపై ఇంకోదాని ప్రభావం ఉంటుందని తెలిసినా.. అనివార్య పరిస్థితుల్లో రిలీజ్ చేస్తుంటారు. ఏటా తెరకెక్కే సినిమాలు అంతకంతకూ పెరిగిపోతుండటంతో ఇలా ఒకదాని మీద ఒకటి వేసుకోక తప్పని పరిస్థితి తలెత్తింది.
ఐతే ఇప్పుడు థియేటర్లన్నీ మూతపడి ఉన్నాయి. కొత్త సినిమాలు చాలా వరకు ఫస్ట్ కాపీతో రెడీ అయి కూడా విడుదలకు నోచుకోకుండా ఉన్నాయి. వీటిలో కొన్నిటిని ఓటీటీల్లో రిలీజ్ చేసేస్తున్నారు. ఐతే అక్కడైనా రిలీజ్ విషయంలో ఆగి.. ఆచితూచి రిలీజ్ చేస్తున్నారా అంటే అదీ లేదు.
ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయిన సినిమాలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉండటంతో ఒకే వీకెండ్లో మూణ్నాలుగు సినిమాలు రిలీజ్ చేసే పరిస్థితి తలెత్తుతోంది. ఈ నెలాఖర్లో ఒకే వారాంతంలో నాలుగు కొత్త చిత్రాలు ఓటీటీల్లో విడుదలవుతుండటం విశేషం. ఆ నాలుగు సినిమాలూ నాలుగు వేర్వేరు ఓటీటీల్లో రిలీజవుతుండటం విశేషం. అమేజాన్ ప్రైంలో విద్యాబాలన్ సినిమా శకుంతలా దేవిని జులై 31న విడుదల చేయబోతున్నట్లు ఇంతకుముందే ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజాగా నెట్ ఫ్లిక్స్ వాళ్లు అదే రోజు నవాజుద్దీన్ సిద్దిఖీ చిత్రం రాత్ అకేలి హై ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. మరోవైపు హాట్ స్టార్ వాళ్లు లూట్ కేస్ చిత్రాన్ని జులై 31కే షెడ్యూల్ చేశారు. దీనికి ఒక రోజు ముందు జీ5లో విద్యుత్ జమాల్ చిత్రం యారా రిలీజ్ కాబోతోంది. ఓటీటీల్లోనూ ఒక రిలీజ్ డేట్ కోసం ఇంత పోటీ నెలకొనడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
This post was last modified on July 17, 2020 10:00 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…