ఊహించిన దానికన్నా చాలా పెద్ద స్థాయిలో బాక్సాఫీస్ వద్ద సునామిలాగా విరుచుకుపడుతున్న అవతార్ 2కు డేంజర్ బెల్స్ మొదలయ్యాయి. ఇవాళ సోమవారం డ్రాప్ స్పష్టంగా కనిపిస్తోంది. ఉదాహరణకు ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో మార్నింగ్ షోకు సుప్రసిద్ధ సుదర్శన్ 35 ఎంఎంలో పది వేలు కూడా రాలేదని ట్రేడ్ టాక్.
పక్కన దేవిలోనూ పదిహేను వేలకు మించి రాబట్టలేకపోయింది. ఇది మూడు రోజులు టికెట్ ముక్క దొరకని అవతార్ ది వే అఫ్ వాటర్ పరిస్థితి. సాధారణంగా ఏ సినిమాకైనా మండే ఈ తరహా పరిస్థితి ఎదురవుతుంది కానీ బ్లాక్ బస్టర్స్ దానికి మినహాయింపుగా నిలుస్తాయి. యాభై శాతానికి పైగానే ఆక్యుపెన్సీ చూపిస్తాయి.
తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల మరీ ఇంత దారుణంగా కాకపోయినా స్క్రీన్లు ఎక్కువ కావడంతో యాభై శాతం కంటే తక్కువ ఫుల్సే నమోదవుతున్నట్టు తెలిసింది. మొదటి వీకెండ్ ఒక్క ఏపీ తెలంగాణ నుంచే అవతార్ 2 సుమారు 37 కోట్ల దాకా గ్రాస్ రాబట్టడం చిన్న విషయం కాదు.
కొందరు టాలీవుడ్ మీడియం రేంజ్ స్టార్లు ఫుల్ రన్ లో కలగనే ఫిగర్ ఇది. అలాంటిది ఒక హాలీవుడ్ డబ్బింగ్ మూవీకి ఈ స్థాయి అదరణ దక్కడం గొప్పే. ఇంత చేసినా అవెంజర్స్ ఎండ్ గేమ్ ని పలు విషయాల్లో క్రాస్ చేయలేకపోవడం గమనించాల్సిన విషయం. మొత్తం థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్నాక క్లారిటీ వస్తుంది
ఇండియా వైడ్ చూసుకుంటే ఈ విజువల్ వండర్ 160 కోట్లకు గ్రాస్ కు చేరుకుంది. నిర్మాణ సంస్థ పెట్టుకున్న టార్గెట్ ఆరు వందల కోట్ల దాకా ఉంది. ఇదంత ఈజీ అయితే కనిపించడం లేదు. ఈ వారం హిందీ నుంచి తెలుగు దాకా ప్రతి భాషలోనూ చెప్పుకోదగ్గ రిలీజులు ఉన్నాయి.
వాటి టాక్ మీద అవతార్ 2 పికప్ కావడం తగ్గడం ఆధారపడి ఉంది. ఇతర దేశాల్లోనూ పెద్ద తెరలున్న త్రీడి స్క్రీన్లలో తప్ప మిగిలిన వాటిలో రెస్పాన్స్ కొద్దికొద్దిగా తగ్గుతోంది. దర్శకుడు జేమ్స్ క్యామరూన్ ఆవిష్కరించిన ఈ అద్భుత మాయాజాలం ఇకపై కూడా దూకుడుని ఆపకుండా కొనసాగించాలి. అప్పుడే బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాలు మొదలవుతాయి.
This post was last modified on December 19, 2022 12:54 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…