టాలీవుడ్ ప్రొడ్యూసర్లలో యాటిట్యూట్ కా బాప్ అని పేరున్న నిర్మాత సూర్యదేవర నాగవంశీ. సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత అయిన నాగవంశీ వివిధ సందర్భాల్లో తన సినిమాల గురించి.. ఇండస్ట్రీ సంబంధిత విషయాల గురించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. తాజాగా ఆయన ‘అవతార్’ సినిమా చూసి దాని మీద వ్యంగ్యంగా పెట్టిన పోస్టు చర్చనీయాంశం అయింది.
కట్ చేస్తే ఇప్పుడు తన ప్రొడక్షన్లో తెరకెక్కిన ‘బుట్టబొమ్మ’కు సంబంధించి ఒక కాపీ పోస్టర్‌తో నాగవంశీ విమర్శకులకు కావాల్సినంత కంటెంట్ ఇచ్చేశాడు. ఇప్పటికే పలుమార్లు రిలీజ్ డేట్ మార్చుకున్న ‘బుట్టబొమ్మ’కు తాజాగా కొత్త విడుదల తేదీని ప్రకటించారు. జనవరి 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించారు. ఐతే ఈ సందర్భంగా లాంచ్ చేసిన పోస్టర్.. హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ ‘ది ప్రెస్టిజ్’ నుంచి కాపీ కొట్టింది.
పోస్టర్ నుంచి స్ఫూర్తి పొంది కొంచెం వైవిధ్యం చూపించి ఉంటే వేరు. కానీ ఉన్నదున్నట్లుగా కాపీ కొట్టేయడంతో విమర్శలు తప్పట్లేదు. ఓపక్క ‘అవతార్-2’ లాంటి విజువల్ వండర్ మీద కౌంటర్లు వేస్తూ నాగవంశీ చేసిందేంటంటూ ఆయన మీద నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. కాపీ కొట్టేటపుడు కొంచెం చూసుకోవాల్సిందని.. క్రిస్టోఫర్ నోలన్ సినిమా పోస్టర్ నుంచి కాపీ కొడితే ఈజీగా దొరికిపోతామని నాగవంశీ అండ్ టీంకు తెలియకపోవడం విడ్డూరం అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
ఐతే ‘బుట్టుబొమ్మ’ సినిమాకు అస్సలు బజ్ లేని నేపథ్యంలో ఈ కాపీ పోస్టర్‌తో కాంట్రవర్శీ క్రియేట్ చేస్తే ఫ్రీ పబ్లిసిటీ వస్తుందన్న ఉద్దేశంతో కావాలనే ఇలా చేసి ఉండొచ్చేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మలయాళ హిట్ ‘కప్పెలా’కు రేమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రంతో శౌరీ చంద్రశేఖర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అనైక సురేంద్రన్ ఇందులో లీడ్ రోల్ చేసింది.
This post was last modified on December 18, 2022 1:43 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…