కొంచెం మిక్స్‌డ్ టాక్ ఉన్నప్పటికీ భారీ వసూళ్లతో సాగిపోతుంటే.. ‘అవతార్-2’ను డిజాస్టర్ అని అప్పుడే ఎలా తీర్మానించేశారు అని ఆశ్చర్యం కలగుుతోందా? ఐతే ఇది మొత్తంగా ‘అవతార్-2’ వసూళ్లకు సంబంధించిన విషయం కాదు. ఆ సినిమా 2డీ వెర్షన్ ముచ్చట. ఈ చిత్రాన్ని 2డీ, త్రీడీ, 4డీఎక్స్.. ఇలా వివిధ ఫార్మాట్లలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
4డీ ఎక్స్ స్క్రీన్లు ఇండియాలో చాలా పరిమితంగా ఉన్నాయి. త్రీడీలో మాత్రం సినిమా విస్తృతంగా రిలీజైంది. మల్టీప్లెక్సులన్నీ దాదాపుగా త్రీడీ వెర్షన్‌నే రిలీజ్ చేశాయి. వాటిలో ఆక్యుపెన్సీ చాలా బాగుంది. తొలి రోజు నుంచి త్రీడీ థియేటర్లన్నీ దాదాపు హౌస్ ఫుల్స్‌తోనే నడుస్తున్నాయి. మిక్స్‌డ్ టాక్ ఉన్నప్పటికీ వసూళ్లలో పెద్ద డ్రాప్ అయితే లేదు. ఐతే సింగిల్ స్క్రీన్లలో ‘అవతార్-2’ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు.
రెనొవేట్ చేసి ఆధునిక టెక్నాలజీని సమకూర్చుకుని పిక్చర్, సౌండ్ క్వాలిటీ బాగున్న సింగిల్ స్క్రీన్లలో ‘అవతార్-2’ బాగానే ఆడుతోంది. అలాంటి థియేటర్లలో చాలా వరకు త్రీడీ వెర్షన్‌నే ప్రదర్శిస్తున్నారు. అలా కాకుండా సాధారణ థియేటర్లు, 2డీ వెర్షన్ ప్రదర్శిస్తున్న థియేటర్లు మాత్రం తొలి రోజు నుంచే వెలవెలబోతున్నాయి.
సమీపంలో ఉన్న మల్టీప్లెక్సుల్లో టికెట్లు దొరకని పరిస్థితి కనిపిస్తుంటే.. ఈ థియేటర్లలో టికెట్లు కొనేవారు లేరు. ‘అవతార్-2’ లాంటి విజువల్ వండర్ చూడడానికి కొంచెం ఖర్చు ఎక్కువ అయినా పర్వాలేదని ప్రేక్షకులు మంచి థియేటర్, త్రీడీ వెర్షన్ చూసుకుంటుండడంతో 2డీ వెర్షన్ ప్రదర్శిస్తున్న సింగిల్ స్క్రీన్లకు ఇబ్బందులు తప్పట్లేదు.
మొత్తంగా చెప్పాలంటే ‘అవతార్-2’ 2డీ వెర్షన్ డిజాస్టర్ అనడంలో మరో మాటలేదు. ఇక మొత్తంగా చూస్తే ‘అవతార్-2’ ఇండియాలో రెండు రోజుల్లోనే దాదాపు వంద కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం విశేషం. ఫుల్ రన్లో ఈ చిత్రం ఫుల్ రన్లో ఇండియాలో రూ.250-300 కోట్ల మధ్య వసూళ్లు సాధించే అవకాశముంది.
This post was last modified on December 18, 2022 1:44 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…