కార్తికేయ 2తో ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టేసిన నిఖిల్ కొత్త సినిమా 18 పేజెస్. ఎప్పుడో నిర్మాణం జరుపుకున్నప్పటికీ విడుదల వాయిదా పడుతూ ఎట్టకేలకు ఈ నెల 23న మోక్షం దక్కించుకుంటోంది. గీతా ఆర్ట్స్ 2 లాంటి అగ్ర నిర్మాణ సంస్థ, సుకుమార్ రచన, కుమారి 21 ఎఫ్ సక్సెస్ ఫుల్ మూవీ ఇచ్చిన దర్శకుడు, వీటితో పాటు అనుపమ పరమేశ్వరన్ తో కూడిన హిట్ జంట ఇన్ని ఉన్నా ఎందుకు లేట్ అయ్యిందో కానీ ఏదైతేనేం సరైన టైంలోనే వస్తోంది. మొన్నటిదాకా ఇందులో ఏముందో తెలియక పెద్దగా అంచనాలు పుట్టలేదు కానీ తాజాగా వదిలిన ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో పాటు హైప్ తెచ్చేలా ఉంది.
చక్కగా ఉద్యోగం చేసుకునే ఓ కుర్రాడి(నిఖిల్)కి నందిని(అనుపమ పరమేశ్వరన్)నుంచి ఫోన్ వస్తుంది. మాటలు కలుస్తాయి. అయితే ఆ అమ్మాయిది 1990ల నాటి మైండ్ సెట్. ఆలోచనలు సున్నితంగా ఉంటాయి. ఫేస్ బుక్ లాంటివి వాడటం అసలు తెలియదు. క్రమంగా ఇష్టం కాస్తా ఆమె మీద ప్రేమగా మారుతుంది. తన జీవితం గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్న టైంలో కొన్ని విస్మయం కలిగించే విషయాలు తెలుస్తాయి. నందిని వెనుకో గతంలో పాటు పెద్ద ప్రమాదం ఉందని అర్థమవుతుంది. అసలు తన డైరీలో ఉన్న పేజీలకు ఈ యువకుడికి మధ్య కనెక్షన్ ఏంటనేది సినిమాలో చూడమంటున్నారు.
లైన్ అయితే ఫ్రెష్ గా అనిపిస్తోంది. లేని అమ్మాయిని ఊహించుకుని నిఖిల్ అంత దూరం వెళ్లాడా లేక నిజంగానే నందిని ఎక్కడో ఉంటూ ఇతని సహాయం కోరుకుందా, ఎందుకు ఇద్దరి లైఫ్ లో అటుఇటు పరుగులు పెట్టే పరిస్థితి వచ్చిందనే లింకులతో సుకుమార్ ఏదో డిఫరెంట్ గానే ఇచ్చినట్టు ఉన్నారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ కూడా కనిపిస్తోంది. చెప్పీ చెప్పనట్టు తెలివిగా కట్ చేసిన 18 పేజెస్ ట్రైలర్ రొటీన్ కాదనే ఫీలింగ్ అయితే కలిగించింది. సూర్య ప్రతాప్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ టిపికల్ లవ్ థ్రిల్లర్ వచ్చే శుక్రవారం రవితేజ ధమాకాతో పోటీ పడనుంది.
This post was last modified on December 17, 2022 11:06 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…