కొన్ని నెలల కిందట తమిళ చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’ను తెలుగులో సరిగా ఆదరించట్లేదని, ఆ సినిమాను తక్కువ చేస్తున్నారని తమిళ జనాలు, విమర్శకులు తెగ ఫీలైపోయారు. మన వాళ్లకు అభిరుచి లేదని.. తాము బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాలను ఆదరించినట్లు తెలుగు వాళ్లు వేరే భాషా చిత్రాలను విశాల హృదయంతో ఆదరించట్లేదని కామెంట్లు చేశారు. కానీ ఇతర భాషా చిత్రాల విషయంలో తెలుగు వాళ్లు చూపించే పెద్ద మనసు విషయంలో దేశంలో మరే భాషకు చెందిన ప్రేక్షకులు సాటి రారు అంటే అతిశయోక్తి కాదు.
భాష, ప్రాంతం ఇవేవీ చూడకుండా సినిమా బాగుందంటే చాలు పరిగెత్తుకుని థియేటర్లకు వెళ్లిపోవడం తెలుగు ప్రేక్షకులకే చెల్లింది. ‘కాంతార’ అనే సినిమా టీంలో ఎవ్వరూ మన వారికి పరిచయం లేకపోయినా సరే.. ఆ సినిమా బాగుందన్న టాక్ రాగానే కన్నడ వెర్షన్‌ను ఎగబడి చూశారు. ఇక ఆ చిత్రం తెలుగులో రిలీజైతే బ్రహ్మరథం పట్టారు.
ఇటీవలే ‘లవ్ టుడే’ అనే చిన్న చిత్రం పబ్లిసిటీ లేకుండా తెలుగులో రిలీజ్ చేస్తే దాన్ని కూడా సూపర్ హిట్ చేసిన ఘతన మన వాళ్లకే సొంతం. ఇప్పుడు అవతార్-2 విషయంలోనూ తెలుగు ప్రేక్షకుల నుంచి ఇలాంటి స్పందనే కనిపిస్తోంది. ఈ సినిమా విడుదలకు ముందే నెగెటివ్ రివ్యూలు బయటికి రావడంతో ఇతర భాషల ప్రేక్షకులు అంత ఉత్సాహంగా థియేటర్లకు కదల్లేదు. కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం ఈ విజువల్ వండర్‌ను థియేటర్లలో చూసి తీరాలనే ఉత్సాహంతో పెద్ద ఎత్తున థియేటర్లకు కదిలారు.
రెండు రాష్ట్రాల్లోని మెజారిటీ థియేటర్లలో ‘అవతార్-2’ రిలీజ్ కాగా.. త్రీడీ థియేటర్లన్నీ దాదాపుగా జనాలతో నిండిపోయాయి. మల్టీప్లెక్సుల్లో అయితే టికెట్లు దొరకడం కష్టమైంది. తొలి రోజు డివైడ్ టాక్ వచ్చినా జోరేమీ తగ్గినట్లు కనిపించడం లేదు. తొలి రోజు ఇండియాలో ‘అవతార్-2’కు వచ్చిన వసూళ్లు 40 శాతానికి పైగా తెలుగు రాష్ట్రాల నుంచి రావడం చూసి జాతీయ స్థాయిలో ట్రేడ్ పండిట్లు షాకవుతున్నారు. మనవాళ్ల సినిమా అభిమానం వేరే లెవెల్ అంటూ కొనియాడుతున్నారు.
This post was last modified on December 17, 2022 10:54 pm
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…