Movie News

రీయూనియన్ ఎమోషన్లో మాటిచ్చేసిన చిరు?

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని డిసైడయ్యాక తొలి రెండు చిత్రాల విషయంలో కొంచెం ఎక్కువ టైమే తీసుకున్నారు. కానీ ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి చిత్రాల తర్వాత ఆయన జోరు పెంచారు. కరోనా వల్ల ‘ఆచార్య’ కొంచెం ఆలస్యం అయినా.. ఆ సినిమా రిలీజైన కొన్ని నెలలకే ‘గాడ్ ఫాదర్’తో ప్రేక్షకులను పలకరించారు. ఇక సంక్రాంతికి ఆయన ‘వాల్తేరు వీరయ్య’తో రాబోతున్నారు. తర్వాత కొన్ని నెలలకే వేసవిలో ‘భోళా శంకర్’గా దర్శనమిస్తారు.

దీని తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వంలో చిరు ఓ సినిమా చేయాల్సింది కానీ.. స్క్రిప్టు సంతృప్తినివ్వకపోవడంతో దాన్ని పక్కన పెట్టక తప్పలేదు. మరి ‘భోళా శంకర్’ రెడీ అయ్యాక చిరు నటించే చిత్రం ఏదా అన్న ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ వ్యక్తమవుతోంది. చిరుతో సినిమా చేయడానికి తెలుగులో చాలామంది నిర్మాతలే లైన్లో ఉన్నా.. ఆయన మాత్రం తమిళ నటి, నిర్మాత రాధికా శరత్‌కుమార్‌కు మాటిచ్చినట్లుగా తాజా వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

ఒకప్పుడు తనతో వరుసగా సినిమాలు చేసిన రాధికతో పాటు ఆమె భర్త శరత్ కుమార్ అంటే చిరుకు ప్రత్యేక అభిమానం ఉంది. శరత్ హీరోగా స్థిరపడకముందు, తనతో ‘గ్యాంగ్ లీడర్’ చేస్తున్న టైంలోనే అతడిని ఆదుకోవడానికి చిరు అప్పట్లో ముందుకొచ్చాడు. ఆర్థిక సమస్యల్లో ఉన్న తనను బయటపడేయడానికి తన ప్రొడక్షన్లో సినిమా చేయడానికి చిరు ముందుకు వచ్చాడని, పారితోషకం గురించి కూడా మాట్లాడకుండా సినిమా చేసుకోమని చెప్పాడని.. ఐతే అనుకోకుండా అదే టైంలో తాను హీరోగా బ్రేక్ అందుకోవడంతో ఆ సినిమా చేయాల్సిన అవసరం పడలేదని శరత్ కుమార్ ఒక సందర్భంగా ఎంతో కృతజ్ఞతా పూర్వకంగా చెప్పుకున్నారు.

ఐతే రాధిక, శరత్ కుమార్ ఈ మధ్య ఆర్థికంగా కొంచెం ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. రాడాన్ పిక్చర్స్ మీద ఒక టైంలో వరుసగా సీరియళ్లు, సినిమాలు నిర్మించిన రాధిక.. మధ్యలో ప్రొడక్షన్ ఆపేసింది. శరత్ నటుడిగా అంత బిజీగా ఏమీ లేడు. ఈ నేపథ్యంలో చిరుతో సినిమా చేసి రాడాన్‌ను నిలబెట్టాలని రాధిక భావించినట్లు తెలుస్తోంది. ఏటా ఎయిటీస్ రీయూనియన్ కార్యక్రమంలో చిరు, రాధిక, శరత్ కలుస్తుంటారు. ఈ మధ్యే ఆ వేడుక జరిగింది. ఆ టైంలోనే చిరు నుంచి రాధిక, శరత్ మాట తీసుకుని సినిమాకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

This post was last modified on December 17, 2022 10:55 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

4 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

6 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

6 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

6 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

6 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

7 hours ago