Movie News

ర‌ష్యాలో పుష్ప అడ్రస్ గ‌ల్లంతు

స‌రిగ్గా ఏడాది కింద‌ట విడుద‌లైన అల్లు అర్జున్-సుకుమార్ మూవీ పుష్ప పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్‌బ‌స్ట‌ర్ అయింది. డివైడ్ టాక్‌ను త‌ట్టుకుని ఆ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గర బ‌లంగా నిల‌బ‌డింది. తెలుగులో కంటే కూడా ఇత‌ర భాష‌ల్లో ఆ చిత్రం పెద్ద హిట్ట‌యింది. ఆ సినిమా పాట‌లు.. బ‌న్నీ మేన‌రిజ‌మ్స్ ఎంత పాపుల‌ర్ అయ్యాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

అంత‌ర్జాతీయ స్థాయిలో అప్లాజ్ రావ‌డంతో ఈ మ‌ధ్యే చిత్ర బృందం.. పుష్ప చిత్రాన్ని ర‌ష్య‌న్ భాష‌లోకి అనువ‌దించింది. ఊరికే నామ‌మాత్రంగా డ‌బ్ చేసి రిలీజ్ చేయ‌డం కాకుండా.. అల్లు అర్జున్, సుకుమార్, ర‌ష్మిక మంద‌న్నా, దేవిశ్రీ ప్ర‌సాద్ క‌లిసి ర‌ష్యాకు వెళ్లి సినిమాను గ‌ట్టిగా ప్ర‌మోట్ చేశారు కూడా. ఇందుకోసం దాదాపు ఏడు కోట్ల దాకా బ‌డ్జెట్ అయిన‌ట్లు కూడా వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఇంతా చేసి ఏ ప్ర‌యోజ‌నం లేకుండా పోయింద‌న్న‌ది ర‌ష్య‌న్ ట్రేడ్ వ‌ర్గాల మాట‌.

పుష్ప ర‌ష్య‌న్ వెర్ష‌న్‌కు కనీస స్థాయిలో కూడా స్పంద‌న లేక‌పోయింది. కోట్లు ఖ‌ర్చు పెట్టి ప్ర‌మోష‌న్లు చేస్తే సినిమాకు అక్క‌డ ల‌క్ష‌ల్లో మాత్ర‌మే వ‌సూళ్లు వ‌చ్చాయ‌ట‌. డ‌బ్బింగ్, రిలీజ్ ఖ‌ర్చులు కూడా వెన‌క్కి రాలేద‌ని తెలుస్తోంది. డిసెంబ‌రు 8న సినిమా రిలీజ్ కాగా.. గ‌త వారం రోజుల్లో ర‌ష్య‌న్ వెర్ష‌న్ గురించి చిత్ర బృందం ఒక్క మాటా మాట్లాడ‌లేదంటేనే ప‌రిస్థితి ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. అక్క‌డ సినిమాకు ఓ మోస్త‌రు స్పంద‌న వ‌చ్చినా అల్లు అర్జున్ పీఆర్ టీం మామూలు హ‌డావుడి చేసేది కాదు. అంద‌రూ గ‌ప్‌చుప్ అన్న‌ట్లు ఉన్నారంటే సినిమా ర‌ష్యాలో వాషౌట్ అని తేలిపోతోంది.

బ‌న్నీ మేన‌రిజ‌మ్స్‌ను ఐరోపా క్ఈర‌డా ఈవెంట్ల‌లో అనుక‌రించార‌ని.. అత్యుత్సాహంతో కోట్లు ఖ‌ర్చు పెట్టిన చిత్ర బృందానికి ర‌ష్య‌న్లు పెద్ద షాకే ఇచ్చిన‌ట్లున్నారు. ఈ ప‌రిణామం బ‌న్నీ అండ్ కోకు చాలా చికాకు తెప్పించేదే అన‌డంలో సందేహం లేదు.

This post was last modified on December 17, 2022 6:27 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అర్థం కాలేదన్న సినిమాను ఎగబడి కొంటున్నారు

కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…

55 minutes ago

కాకినాడ పోర్టు మళ్లీ కేవీ రావు చేతికి.. డీల్ కు అరబిందో రెఢీ

గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…

1 hour ago

జపాన్ జనాలకు కల్కి ఎక్కలేదా

ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…

2 hours ago

చరిత్రలో తొలిసారి: మారథాన్ లో మనిషితో రోబోలు

మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…

2 hours ago

ఫ్యాషన్ ఐకాన్ లా నారా లోకేశ్!

నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……

2 hours ago

ట్రంప్ కేబినెట్ నిండా బిలియనీర్లే

అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…

3 hours ago