Movie News

నార‌ప్ప‌ చూసి అవ‌తార్ తీశారా?

ప్ర‌పంచ సినీ చ‌రిత్ర‌లో ఇప్ప‌టిదాకా లేనంత భారీ స్థాయిలో, భారీ అంచ‌నాల మ‌ధ్య ఈ రోజే ప్రేక్ష‌కుల ముదుకు వ‌చ్చింది అవ‌తార్: ది వే ఆఫ్ వాట‌ర్ చిత్రం. ఈ సినిమాలో జేమ్స్ కామెరూన్ ఇచ్చిన విజువ‌ల్ ట్రీట్‌కు మెజారిటీ ప్రేక్ష‌కులు ఫిదా అయిపోతున్నారు. కాక‌పోతే క‌థాక‌థ‌నాల విష‌యంలో, నిడివి విష‌యంలో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ మ‌నం పెట్టే టికెట్ డ‌బ్బుల‌కు గిట్టుబాటు అవుతుంద‌నే అభిప్రాయం స‌మీక్ష‌కులు, అలాగే ప్రేక్ష‌కుల నుంచి వినిపిస్తోంది.

ఇదిలా ఉండ‌గా.. అవ‌తార్-2 సినిమాకు ఒక ఇండియ‌న్ మూవీతో పోలుస్తూ సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతుండ‌డం విశేషం. తెలుగులో నార‌ప్ప‌గా రీమేక్ అయిన త‌మిళ చిత్రం అసుర‌న్ క‌థ‌తో అవ‌తార్-2 స్టోరీకి చాలా పోలిక‌లు క‌నిపిస్తుండ‌డం విశేషం.

అసుర‌న్ త‌న కుటుంబాన్ని కాపాడుకోవ‌డానికి ఎంత దూర‌మైనా వెళ్లే ఒక తండ్రి క‌థ‌. అందులో శ‌త్రువుల దాడిలో ఒక కొడుకును కోల్పోతాడు. మిగ‌తా కుటుంబాన్ని కాపాడుకోవ‌డానికి హీరో శ‌త్రువులతో పోరాడ‌తాడు. అవ‌తార్-2 క‌థ కూడా డిట్టో ఇలాగే ఉండ‌డం విశేషం. ఐతే క‌థ ప‌రంగా పోలిక‌లు యాదృచ్ఛికంగానే జ‌రిగి ఉండొచ్చు కానీ.. త‌మిళ జ‌నాలు మాత్రం కామెరూన్ అసుర‌న్ చిత్రాన్ని కాపీ కొట్టాడంటూ స‌ర‌దాగా పోస్టులు పెడుతున్నారు.

విశేషం ఏంటంటే.. అవ‌తార్-1కు సైతం ఓ ఇండియ‌న్ మూవీతో పోలిక‌లు ఉండ‌డం విశేషం. ఆ చిత్ర‌మే.. వియ‌త్నాం కాల‌నీ. అది మోహ‌న్ లాల్ హీరోగా న‌టించిన మ‌ల‌యాళ మూవీ. ఒక కాల‌నీ వాసుల‌ను ఖాళీ చేయించ‌డానికి విల‌న్ బ్యాచ్ హీరోను అక్క‌డికి పంప‌డం.. అత‌ను త‌ర్వాత వాళ్ల‌లో క‌లిసిపోయి విల‌న్ బ్యాచ్‌ను ఎదిరించ‌డం.. ఈ నేప‌థ్యంలో సినిమా న‌డుస్తుంది. అవ‌తార్ సినిమా సైతం పాండోరా గ్ర‌హం నేప‌థ్యంలో ఇదే లైన్లో న‌డుస్తుంద‌న్న సంగ‌తి తెలిసిందే. ఆ చిత్రం త‌మిళంలో అదే పేరుతో రీమేక్ కావ‌డంతో అవ‌తార్ సినిమాలు రెంటికీ త‌మిళ చిత్రాలే స్ఫూర్తి అంటున్నారు త‌మిళ నెటిజ‌న్లు.

This post was last modified on December 17, 2022 6:19 am

Share

Recent Posts

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

4 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

5 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

5 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

5 hours ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

8 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

8 hours ago