పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత రెండు వారాల్లో షాక్‌ల మీద షాక్‌లు ఇచ్చాడు. ఓవైపు క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న హరిహర వీరమల్లు ఒక కొలిక్కి రాకముందే సాహో దర్శకుడు సుజీత్ డైరెక్షన్లో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించే సినిమాకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు అనౌన్స్‌మెంట్ వచ్చిన వారం రోజుల్లోనే హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే కొత్త చిత్రానికి ప్రారంభోత్సవ వేడుక చేశారు.
తనకున్న పొలిటికల్ కమిట్మెంట్ల మధ్య హరిహర వీరమల్లునే పూర్తి చేయలేకపోతున్న పవన్.. ఈ సినిమాలను ఎప్పుడు మొదలుపెడతాడో, ఎప్పుడు పూర్తి చేస్తాడో తెలియక అయోమయంలో పడిపోయారు అభిమానులు. వాళ్ల కన్ఫ్యూజన్‌ను మరింత పెంచుతూ.. త్వరలోనే మరో చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నాడట పవన్.
ఈ ఏడాది ఆరంభంలో చర్చల్లోకి వచ్చి, ఆ తర్వాత పక్కకు వెళ్లిపోయిన వినోదియ సిత్తం రీమేక్‌ను జనవరిలో పవన్ మొదలుపెట్టబోతున్నాడన్నది తాజా సమాచారం. ఒక టైంలో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లడమే తరువాయి అన్నారు. కానీ తర్వాత దాని గురించి చర్చే లేదు. దీంతో సినిమా ఆగిపోయిందని అనుకున్నారంతా. కానీ ఈ సినిమా మళ్లీ తెరపైకి వస్తున్నట్లు సమాచారం. ప్రారంభోత్సవంతో పాటు షూటింగ్ కూడా మొదలు కానుందట. మరి హరిహర వీరమల్లు పరిస్థితేంటో.. కొత్తగా ప్రకటించిన ఇంకో రెండు చిత్రాల సంగతేంటో చూడాలి మరి.
ఒరిజినల్ డైరెక్టర్ సముద్రఖనినే తీయబోతున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్, అడిషనల్ స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు..ఇందులో పవన్ ఒరిజినల్లో సముద్రఖని చేసిన దైవదూతలో కనిపించబోతుంటే.. తంబిరామయ్య చేసిన మిడిలేజ్డ్ క్యారెక్టర్ని యుకుడిగా మార్చి అందులో సాయిధరమ్ తేజ్‌ను నటింపజేస్తారని ఇంతకుముందే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించే ఛాన్సుంది.
This post was last modified on December 17, 2022 6:13 am
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…