Movie News

దిల్ రాజు..పై పేలిపోయే మీమ్

దిల్ రాజు.. గత కొన్ని నెలల్లో టాలీవుడ్ సర్కిల్స్‌లో హీరోలను మించి చర్చనీయాంశం అయిన పేరు. సోషల్ మీడియాలో కూడా ఈ పేరు హాట్ టాపిక్ అయింది. సంక్రాంతి సినిమాల గురించి చర్చలంటే హీరో హీరోయిన్లు, దర్శకుల గురించి డిస్కషన్ ఉంటుంది కానీ.. దానికంటే కూడా నిర్మాత పేరు చర్చనీయాంశం కావడం ఇప్పుడే చూస్తున్నాం.

ఆయన నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘వారిసు’ మూవీ తెలుగు వెర్షన్‌కు థియేటర్లు కేటాయించే విషయమై తలెత్తిన వివాదం ఒక దశలో రెండు ఇండస్ట్రీల మధ్య గొడవలా మారే పరిస్థితి కనిపించింది. చిరంజీవి, బాలకృష్ణల చిత్రాలు ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’లకు దీటుగా ‘వారసుడు’కు థియేటర్లు ఇవ్వడంపై నెల కిందట్నుంచి పెద్ద చర్చే నడుస్తుండగా.. ఈ సినిమాకు సరిపడా థియేటర్లు ఇవ్వకపోతే తమిళంలో రిలీజయ్యే తెలుగు సినిమాల సంగతి చూస్తాం అన్నట్లుగా తమిళ దర్శకుడు లింగుస్వామి హెచ్చరించడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రాజు తన వివరణతో గొడవకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు.

ఐతే పండక్కి తెలుగు సినిమాలను కాదని తమిళ చిత్రాలకు ఎలా థియేటర్లు ఇస్తాం అంటూ గతంలో చేసిన ప్రకటన దగ్గర్నుంచి విజయ్ తమిళంలో పెద్ద స్టార్ కాబట్టి ‘వారసుడు’కు తమిళనాట ఎక్కువ థియేటర్లు ఇవ్వాలనే వరకు వివిధ సందర్భాల్లో దిల్ రాజు ఇచ్చిన స్టేట్మెంట్లతో తయారైన ఒక మీమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘అపరిచితుడు’ క్లైమాక్స్‌లో విక్రమ్ స్ప్లిట్ పర్సనాలిటీతో నట విశ్వరూపాన్ని చూపించే సన్నివేశంతో దీన్ని పోలుస్తూ రాజు మీద మీమ్ తయారవడం విశేషం.

ఇందులో విక్రమ్‌కు ‘హార్ట్ కింగ్’ (దిల్ రాజుకు ఇంగ్లిష్ నామధేయం) చేసి… ‘‘తొలి ప్రాధాన్యం తెలుగు చిత్రాలకే ఇవ్వాలి’’.. ‘‘తమిళ్ అయితే ఏంట్రా ముందు మేమే అనౌన్స్ చేశాం’’.. ‘‘మనీ ఏం చేస్కుంటాం ఇండస్ట్రీ బాగుంటే చాలు’’.. ‘‘విజయ్ అజిత్ కంటే పెద్ద స్టార్. మాకు ఎక్కువ స్క్రీన్లు కావాలి’’.. అంటూ ఆయన వేర్వేరు సందర్భాల్లో ఇచ్చిన స్టేట్మెంట్లతో అదిరిపోయే లెవెల్లో ఈ మీమ్ తీర్చిదిద్దారు. ప్రకాష్‌ రాజ్‌ను ప్రేక్షకులుగా చూపించి.. ‘‘రేయ్ రేయ్ ఇరగదీస్తున్నావ్ కదయ్యా’’ అంటూ కామెంట్ కూా చూడించాడు. ఇది నెటిజన్లలో నవ్వులు పూయిస్తోంది. దిల్ రాజు చూసినా ముందు నవ్వుకుంటాడేమో కానీ.. తనపై పడ్డ పంచ్‌ మాత్రం ఆయనకు మంట పుట్టించేదే.

This post was last modified on December 16, 2022 9:10 pm

Share
Show comments
Published by
Satya
Tags: Dil Raju

Recent Posts

ముకేశ్ అంబానీ రూ.వెయ్యి కోట్ల విమానం వచ్చేసింది

ఖరీదైన వస్తువుల్ని కొనుగోలు చేసే విషయంలో భారత కుబేరుడు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఎప్పుడూ ముందుంటారు. ఆయన కొనుగోలు…

4 hours ago

డీజే టిల్లు.. అసలు టైటిల్ అది కాదు

సిద్ధు జొన్నలగడ్డ కెరీర్‌ను గొప్ప మలుపు తిప్పిన సినిమా.. డీజే టిల్లు. చిన్న సినిమాగా రిలీజై పెద్ద విజయం సాధించిన…

4 hours ago

ఈ ప్రశ్నలకు జవాబు చెప్పు భాయ్ జాన్

రేపు విడుదల కాబోతున్న సికందర్ ప్రమోషన్లలో భాగంగా సల్మాన్ ఖాన్ ఇస్తున్న ఇంటర్వ్యూలో కొన్ని మాటలు భలే విచిత్రంగా అనిపిస్తున్నాయి.…

6 hours ago

సిట్ ముందుకు శ్రవణ్… ‘ట్యాపింగ్’ కొలిక్కి వచ్చేనా?

తెలంగాణ రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో శనివారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…

7 hours ago

మంచు విష్ణు ట్విస్ట్ – కన్నప్ప వాయిదా

ఏప్రిల్ 25 విడుదల కావాల్సిన కన్నప్ప వాయిదా పడింది. ఒక కీలక ఎపిసోడ్ కు సంబంధించిన విఎఫ్ఎక్స్ కు ఎక్కువ…

8 hours ago

‘వక్ఫ్’కు వైసీపీ వ్యతిరేకం… అంతలోనే ఎంత మార్పు?

కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ప్రతిపాదించిన వక్ఫ్ సవరణ చట్టానికి ఏపీలోని విపక్షం వైసీపీ వ్యతిరేకమని తేల్చి చెప్పింది. ఈ మేరకు…

8 hours ago