ప్రయాణం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, హిట్, యశోద లాంటి చిత్రాలతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు సంపాదించిన తెలుగమ్మాయి కల్పిక గణేష్‌కు, తెలుగులో చాలా సినిమాల్లో నటించిన తమిళ అమ్మాయి ధన్య బాలకృష్ణన్‌కు మధ్య నడుస్తున్న వివాదం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తన యూట్యూబ్ ఛానెల్లో సినిమాలతో పాటు సినిమా వ్యక్తుల గురించి ఆసక్తికర విశ్లేషణలు చేస్తుంటుంది కల్పిక.
ఐతే తాజాగా ఆమె ధన్య బాలకృష్ణన్ వ్యక్తిగత జీవితం గురించి పెట్టిన వీడియో సంచలనం రేపింది. ధన్యకు తమిళ దర్శకుడు బాలాజీ మోహన్ సీక్రెట్‌గా పెళ్లి జరిగిందని, ఆల్రెడీ పెళ్లయి పిల్లలుున్న బాలాజీ ధన్యను రెండో పెళ్లి చేసుకున్నాడని, కానీ ఈ విషయాన్ని వాళ్లిద్దరూ బయట పెట్టలేదని ఆమె తెలిపింది. ఐతే ఈ వీడియో కొన్ని గంటల్లోనే డెలీట్ అయిపోయింది. కాగా బాలాజీ-దన్య కలిసి ఈ వీడియోను యూట్యూబ్ నుంచి తీయించేశారని కల్పిక ఆరోపణలు చేసింది.
ఇదిలా ఉంటే ధన్య తనకు పర్సనల్‌గా కాల్ చేసి బెదిరించినట్లుగా కల్పిక ఆరోపణలు చేయడం గమనార్హం. ధన్య తనను కావాలనే కాంట్రవర్శీలోకి లాగుతోందని కల్పిక ఆరోపించింది. ధన్యను ఉద్దేశించి ఆమె మరో వీడియో పోస్ట్ చేసింది.
‘‘ధన్యా.. నువ్వు నన్ను వివాదంలోకి లాగుతున్నావు. త్వరలో మనం కోర్టులో కలుసుకుందాం. నీ గురించి చాలా విషయాలు బయటపెట్టేసరికి నన్ను బ్లాక్ చేశావు. తర్వాత నన్ను అన్‌బ్లాక్ చేసి రాత్రి పూట వరుసగా కాల్స్ చేశావు. నువ్వు భయపడ్డావా.. నన్ను భయపెట్టాలనుకుంటున్నావా? ఏం చేసుకుంటావో చేస్కో. నీతో కూర్చుని మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాను. నాకు నీ సారీ వద్దు. నాకు అవకాశాలు రాకపోయినా పర్వాలేదు. నేను అనుకోకుండా నటిని అయ్యాను. ఇది కాకపోతే వేరే పని చేసుకుంటా. నీ పవర్ చూపించి నీ గురించి నేను పెట్టిన వీడియోను యూట్యూబ్‌లో లేకుండా చేశావు కదా. నా పవర్ చూపిస్తే భస్మం అయిపోతారు’’ అని కల్పిక పేర్కొంది. ఈ వ్యవహారం మొత్తం చూస్తుంటే ధన్యతో కల్పికకు పర్సనల్‌గా ఏదో గొడవ ఉన్నట్లు అనిపిస్తోంది.
This post was last modified on December 15, 2022 2:59 pm
ఎల్లుండి విడుదల కాబోతున్న తండేల్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వడం గురించి చర్చ జరుగుతోంది.…
దేశభాషలందు తెలుగు లెస్స అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు అంటుంటే…ఏపీలో వైసీపీ ప్రభుత్వం మాత్రం ఏపీలో తెలుగు ‘లెస్’…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో రెండో వంద కోట్ల బ్లాక్ బస్టర్ గా నిలిచిన సరిపోదా శనివారం అభిమానులతో…
గత నెల సంక్రాంతికి విడుదలైన గేమ్ ఛేంజర్ మొదటి రోజే హెచ్డి పైరసీకి గురి కావడం ఇండస్ట్రీ వర్గాలతో పాటు…
తమిళంలో బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడు అజిత్ కుమార్. సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు తగ్గాక.. అటు విజయ్, ఇటు అజిత్…
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ…