బాలకృష్ణన్ తో కల్పికకు గొడవేంటి?

ప్రయాణం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, హిట్, యశోద లాంటి చిత్రాలతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు సంపాదించిన తెలుగమ్మాయి కల్పిక గణేష్‌కు, తెలుగులో చాలా సినిమాల్లో నటించిన తమిళ అమ్మాయి ధన్య బాలకృష్ణన్‌కు మధ్య నడుస్తున్న వివాదం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తన యూట్యూబ్ ఛానెల్లో సినిమాలతో పాటు సినిమా వ్యక్తుల గురించి ఆసక్తికర విశ్లేషణలు చేస్తుంటుంది కల్పిక.

ఐతే తాజాగా ఆమె ధన్య బాలకృష్ణన్ వ్యక్తిగత జీవితం గురించి పెట్టిన వీడియో సంచలనం రేపింది. ధన్యకు తమిళ దర్శకుడు బాలాజీ మోహన్‌ సీక్రెట్‌గా పెళ్లి జరిగిందని, ఆల్రెడీ పెళ్లయి పిల్లలుున్న బాలాజీ ధన్యను రెండో పెళ్లి చేసుకున్నాడని, కానీ ఈ విషయాన్ని వాళ్లిద్దరూ బయట పెట్టలేదని ఆమె తెలిపింది. ఐతే ఈ వీడియో కొన్ని గంటల్లోనే డెలీట్ అయిపోయింది. కాగా బాలాజీ-దన్య కలిసి ఈ వీడియోను యూట్యూబ్ నుంచి తీయించేశారని కల్పిక ఆరోపణలు చేసింది.

ఇదిలా ఉంటే ధన్య తనకు పర్సనల్‌గా కాల్ చేసి బెదిరించినట్లుగా కల్పిక ఆరోపణలు చేయడం గమనార్హం. ధన్య తనను కావాలనే కాంట్రవర్శీలోకి లాగుతోందని కల్పిక ఆరోపించింది. ధన్యను ఉద్దేశించి ఆమె మరో వీడియో పోస్ట్ చేసింది.

‘‘ధన్యా.. నువ్వు నన్ను వివాదంలోకి లాగుతున్నావు. త్వరలో మనం కోర్టులో కలుసుకుందాం. నీ గురించి చాలా విషయాలు బయటపెట్టేసరికి నన్ను బ్లాక్ చేశావు. తర్వాత నన్ను అన్‌బ్లాక్ చేసి రాత్రి పూట వరుసగా కాల్స్ చేశావు. నువ్వు భయపడ్డావా.. నన్ను భయపెట్టాలనుకుంటున్నావా? ఏం చేసుకుంటావో చేస్కో. నీతో కూర్చుని మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాను. నాకు నీ సారీ వద్దు. నాకు అవకాశాలు రాకపోయినా పర్వాలేదు. నేను అనుకోకుండా నటిని అయ్యాను. ఇది కాకపోతే వేరే పని చేసుకుంటా. నీ పవర్ చూపించి నీ గురించి నేను పెట్టిన వీడియోను యూట్యూబ్‌లో లేకుండా చేశావు కదా. నా పవర్ చూపిస్తే భస్మం అయిపోతారు’’ అని కల్పిక పేర్కొంది. ఈ వ్యవహారం మొత్తం చూస్తుంటే ధన్యతో కల్పికకు పర్సనల్‌గా ఏదో గొడవ ఉన్నట్లు అనిపిస్తోంది.