చాలా తక్కువ టైంలో యూత్‌లో మంచి ఫాలోయింగ్, స్టార్ ఇమేజ్ సంపాదించి సంచలనం రేపాడు విజయ్ దేవరకొండ. ఐతే వచ్చిన సక్సెస్‌ను నిలబెట్టుకోవడంలో అతను కొంచెం తడబడుతున్న సంగతి తెలిసిందే.
డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్.. ఇలా వరుసగా మూడు డిజాస్టర్లు అతడి ఖాతాలో పడ్డాయి. అంతకుముందు రెండు సినిమాల సంగతేమో కానీ.. లైగర్ రిజల్ట్ మాత్రం విజయ్ కాన్ఫిడెన్స్‌ను బాగానే దెబ్బ తీసినట్లు కనిపిస్తోంది. దాన్నుంచి వెంటనే బయటికి వద్దామన్నా కుదరడం లేదు.
సమంతతో చేస్తున్న ఖుషి మూవీ ఆమె అనారోగ్యం కారణంగా తాత్కాలికంగా ఆగిన సంగతి తెలిసిందే. వేరే సినిమాను మొదలుపెడదామని విజయ్ చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి రావడానికి టైం పట్టింది. జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో కథా చర్చలు జరిపిన విజయ్ అతడితో సినిమాను ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధమయ్యాడు.
ఐతే ఈ సినిమాకు నిర్మాతను సెట్ చేసుకోవడంలో కొంచెం టైం పట్టినట్లు కనిపిస్తోంది. ఐతే అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ ప్రాజెక్టులోకి రావడంతో టెన్షన్ లేకపోయింది. ఆయన స్క్రిప్టు విషయంలో కొన్ని అభ్యంతరాలు చెప్పడం.. ఆ మేరకు మార్పులు చేర్పులు చేయడం.. అంతా ఓకే అనుకుని షూటింగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అన్నీ జరిగిపోయినట్లు సమాచారం. రాజు పచ్చ జెండా ఊపడంతో మరి కొన్ని రోజుల్లోనే ఈ సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లబోతున్నారట.
విజయ్ మంచి ఫాంలో ఉండగా అతడితో సినిమా చేయడానికి రాజు గట్టిగా ప్రయత్నించాడు. కానీ కుదర్లేదు. కానీ ఇప్పుడు విజయ్ వరుస ఫెయిల్యూర్లతో ఇబ్బంది పడుతున్న టైంలో అతను రాజుకు దొరికాడు. రామ్ చరణ్‌తో ఒక సినిమా ఓకే అయినట్లే అయి క్యాన్సిల్ కావడంతో గౌతమ్‌కు విజయ్‌తో హిట్టు కొట్టి తనేంటో రుజువు చేసుకోవడం చాలా అవసరం.
This post was last modified on December 15, 2022 7:21 am
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…
అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ).. తాజాగా మరో ఉద్యమానికి తెరదీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…
హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్రమించేవారు కొందరైతే.. తాము చేసిన పనుల కారణంగా చూపిన ధైర్య సాహసాల కారణంగా రాత్రికి…
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…