రామ్ గోపాల్ వర్మ సినిమాల కంటే కూడా ఆయన తన చిత్రాల కోసం చేసే ప్రమోషన్లే అంతో ఇంతో మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అలా అని అవి ఆయన సినిమాలకు ఏమైనా ఉపయోగపడుతున్నాయా అంటే అదేమీ లేదు.
మొన్ననే వర్మ నుంచి ‘డేంజరస్’ అనే సినిమా వచ్చింది. కానీ ఆ సినిమా రిలీజైన సంగతి కూడా ఎవరికీ తెలియదు. ఏదో నామమాత్రంగా రిలీజ్ చేశారు. సినిమా గాల్లో కలిసిపోయింది. కానీ ఈ సినిమా కోసం వర్మ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలు మాత్రం చర్చనీయాంశం అవుతున్నాయి.
ఇటీవలే ఆషు రెడ్డితో కలిసి వర్మ ఒక వల్గర్ ఇంటర్వ్యూ చేశాడు. వల్గర్ అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే.. అందులో పోర్న్ స్టార్ తరహాలో ఆషు రెడ్డి కాళ్లను ఆయన నాకిన తీరు చూసి జనాలకు వెగటు పుట్టింది. దీని మీద వివరణ ఇస్తూ ఇంకో వీడియో రిలీజ్ చేస్తూ ఏవో లాజిక్కులు చెప్పాడు వర్మ. కానీ జనాలకు అదేమీ పట్టలేదు.
ఈలోపు వర్మ ఇంకో వీడియో ఇంటర్వ్యూతో వచ్చాడు. ఎవరో స్టేజీ అట. ఆమెను వర్మ ఇంటర్వ్యూ చేశాడు. పది రోజులు స్నానం చేయనన్న స్టేజీతో నా ఇంటర్వ్యూ అంటూ వర్మ ఇంటర్వ్యూ లింక్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఐతే ఈ ఇంటర్వ్యూలో ఉండేదేంటో జనాలకు తెలుసు కాబట్టి పెద్దగా పట్టించుకోవట్లేదు.
కానీ సీనియర్ రైటర్ కమ్ డైరెక్టర్ బీవీఎస్ రవి ఈ ఇంటర్వ్యూ మీద ఆసక్తికర కామెంట్ చేశాడు. ‘‘ఇదే ఇంటర్వ్యూ వందేళ్ల క్రితం వస్తే రాళ్లతో కొట్టి చంపేసేవారు. యాభై ఏళ్ల క్రితం వస్తే వెలి వేసేవారు. ఇప్పుడు దాదాపుగా సమాజం బరితెగించడం వల్ల మీరు బతికిపోయారు’’ అంటూ వర్మను ట్యాగ్ చేశాడు రవి.
ఈ కామెంట్‌ను బట్టే వీడియో ఎంత సెన్సేషనల్‌గా ఉండొచ్చో అర్థం చేసుకోవచ్చు. ఐతే రవి యథాలాపంగా ఆ కామెంట్ చేశాడా.. వర్మను విమర్శించాడా అన్నది జనాలకు అర్థం కావడం లేదు. ఒకవేళ విమర్శించినా వర్మ అయితే దాన్ని పట్టించుకునే రకం కాదు.
This post was last modified on December 15, 2022 7:28 am
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…
సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సోకాల్డ్ రాజధాని అంటూ అమరావతిని…