ప్రస్తుతం దర్శకుడు శంకర్ తో ప్యాన్ మూవీ చేస్తున్న రామ్ చరణ్ కు అది పదిహేనవ సినిమా అన్న సంగతి తెలిసిందే. బుచ్చిబాబుతో ప్రకటించిన దానికి నెంబర్ ఇవ్వకుండా మెగా కాంపౌండ్ జాగ్రత్త పడింది. అంటే దీనికన్నా ముందు మరొకటి ఉంటుందన్న క్లారిటీ వచ్చెసింధి. అయితే ఎవరితో అనే కన్ఫ్యూజన్ మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇద్దరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. మొదటిది సుకుమార్. పుష్ప 2 ది రూల్ తర్వాత రంగస్థలం కాంబో రిపీట్ కావడం కన్ఫర్మ్ అయ్యింది. రాజమౌళి రెండు మూడు సందర్భాల్లో ఈ విషయాన్ని నొక్కి చెప్పాడు. ఇంట్రో ఎపిసోడ్ చెప్పినప్పుడు తను షాక్ అయ్యానని ఎప్పుడెప్పుడు మొదలువుతుందాని ఎదురు చూస్తున్నట్టుగా తాజాగా ఫిలిం కంపానియన్ ఇంటర్వ్యూలో కూడా ప్రస్తావించారు.
సో ఫలానా టైం అని చెప్పలేం కానీ మొత్తానికి సుక్కు చరణ్ లు చేతులు కలపబోతున్నారు. మరో పేరు నర్తన్. కన్నడ బ్లాక్ బస్టర్ మఫ్టీ ద్వారా వెలుగులోకి వచ్చిన ఇతను చాలా కాలంగా ఒక మాస్ ఎంటర్ టైనర్ మీద వర్క్ చేస్తున్నాడు. యష్ దాదాపు ఓకే చెప్పినంత పని చేసి మళ్ళీ పెండింగ్ లో పెట్టాడు. ఈలోగా అదే కథను చరణ్ కు చెప్పి ఓకే చేయించుకున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టు క్యాన్సిల్ అయ్యింది కాబట్టి ఆ స్థానంలో దీన్ని రీ ప్లేస్ చేసేందుకు యువి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇదింకా అఫీషియల్ కాలేదు కాబట్టి దీనికీ సంఖ్య చెప్పడం కష్టం. ఫైనలయ్యే అవకాశాలు ఎక్కువే
ఆర్ఆర్ఆర్ తర్వాత తమ మీద ఇంటర్నేషనల్ ఫోకస్ పడటంతో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లు ఇద్దరూ స్క్రిప్ట్ ల విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నారు. ఏ చిన్న పొరపాటు చేసినా దాని ప్రభావం నేరుగా ఫేమ్ మీద పడుతుంది. అందుకే కొరటాల శివది ఎంత లేట్ అవుతున్నా తారక్ ఓపిక పడుతున్నాడు తప్పించి హడావిడిగా షూటింగ్ మొదలుపెట్టమని ఒత్తిడి చేయడం లేదు. చరణ్ మాత్రం పక్కా స్కెచ్ తో కాంబోస్ ని సెట్ చేసుకుంటూ రాబోయే రెండుమూడేళ్ల వరకు డైరెక్టర్ల సమస్య రాకుండా చూసుకుంటున్నారు. తర్వాత వరసలో కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కూడా వరసలో ఉన్నారు మరి.
This post was last modified on December 14, 2022 1:24 pm
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…