ఆ మధ్య అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా రిలీజైనప్పుడు బాయ్ కాట్ నినాదం సోషల్ మీడియాలో ఎంత తీవ్రంగా పని చేసిందో ప్రత్యక్షంగా చూశాం. సినిమా బాగుంటే తగ్గేది కానీ అది మరీ డిజాస్టర్ స్థాయిలో ఉండటంతో ఓపెనింగ్స్ కూడా బలంగా రాలేకపోయాయి. బ్రహ్మాస్త్రని సైతం ఈ నిషేధ నినాదాల బ్యాచ్ టార్గెట్ చేసినా కంటెంట్ పర్లేదనిపించేలా ఉండటంతో బాలీవుడ్ వరకు బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తాజాగా వచ్చే నెల విడుదల కాబోతున్న షారుఖ్ ఖాన్ పఠాన్ మీద కూడా మెల్లగా ఈ నీడలు కమ్ముకుంటున్నాయి. ఇటీవలే రిలీజైన బేషరం వీడియో సాంగ్ తాలూకు ప్రకంపనలు మొదలైపోయాయి.
ఈ పాటలో హీరోయిన్ దీపికా పదుకునే రెచ్చిపోయి అందాల ఆరబోత చేసింది. ఇదేమి కొత్తా కాదు వింతా కాదు. అయితే కుంకుమ పువ్వు రంగు స్విమ్ సూట్లు బికినీలు వేసుకుని గ్లామర్ షో చేయడం పట్ల పలు హిందూ వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ బాయ్ కాట్ స్లోగన్ ని స్టార్ట్ చేశాయి. ఇరవై నాలుగు గంటలు దాటకుండానే వేలాది ట్వీట్ లో టాప్ ట్రెండింగ్ లో పెట్టేస్తున్నారు. ఎవరూ ఈ సినిమా చూడకూడదని దీపికాకు గుణపాఠం చెప్పాలంటే ఇదే సరైన మార్గమని ఒకటే హల్చల్ చేస్తున్నారు. దీని గురించి షారుఖ్ తో సహా పఠాన్ బృందంలో ఎవరూ స్పందించలేదు కానీ టాపిక్ అయితే హాట్ గా ఉంది.
ఆ మధ్య దీపికా పదుకునే భర్త రణ్వీర్ సింగ్ న్యూడ్ ఫోటో షూట్ చేసి వివాదం రేపిన సంగతి గుర్తే. కేసులు నమోధై వ్యవహారం కోర్టు దాకా వెళ్ళినప్పుడు తూచ్ అది నేను కాదు మార్ఫింగ్ చేశారని కప్పిపుచ్చుకున్నాడు కానీ అసలు నిజాలు ఇంకా బయటికి రానే లేదు. ఇప్పుడిలా భార్య వల్ల పఠాన్ కో ట్విస్టు వచ్చి పడింది. ఇదంతా తమ మంచికే అని బాద్షా టీమ్ లోలోపల సంతోషంగా ఫీలైనా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే కాంట్రావర్సీ వల్ల వచ్చే ఫ్రీ పబ్లిసిటీ ఎన్ని కోట్లు పోసినా కొనలేం. అందులోనూ మనోభావాలు దెబ్బ తిన్న బ్యాచ్ తోడైతే రీచ్ పెద్ద స్థాయిలో వెళ్ళిపోతుంది. ఇప్పడు జరుగుతోంది అదే మరి.
This post was last modified on December 14, 2022 12:38 pm
కడుపున పుట్టిన బిడ్డకు వైద్యం చేయించేందుకు డబ్బులు లేక ఓ తల్లి చేసిన పని కలచివేస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆరేళ్ల…
యెమెన్ అంతర్గత యుద్ధం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ దళాలకు సౌదీ అరేబియా మద్దతునిస్తోంది. మరోవైపు, యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులు…
భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే మస్క్ సొంత AI చాట్‌బాట్ గ్రోక్…
తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ విజేత ముత్తుకుమరన్ వివాదంలో చిక్కుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వహిదా అక్దర్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో తెరకెక్కుతున్న జైలర్ 2 అక్టోబర్ పదిహేను విడుదలవుతున్న సంగతి…
టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…