టాలీవుడ్లోనే కాదు.. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఎవరికీ సాధ్యం కాని సక్సెస్ స్ట్రీక్ రాజమౌళిది. రెండు దశాబ్దలకు పైగా సాగుతున్న కెరీర్లో రాజమౌళి ఇప్పటిదాకా అపజయం అన్నది ఎదుర్కోలేదు. ‘సై’ సినిమా ఒక్కటి ఓ మోస్తరుగా ఆడింది. అలా అని అది కూడా ఫ్లాప్ అయితే కాదు. జక్కన్న మిగతా సినిమాలన్నీ బ్లాక్‌బస్టర్లే. అందులోనూ ‘బాహుబలి’ సినిమాతో జక్కన్న ప్రభ ఏస్థాయికి చేరిందో.. ‘ఆర్ఆర్ఆర్’తో ఆయన ఇంకా ఎలా ఎదిగిపోయారో చూస్తూనే ఉన్నాం.
ఎంతటి దర్శకులకు అయినా ఏదో ఒక దశలో ఫెయిల్యూర్ ఎదురైంది కానీ.. రాజమౌళికి మాత్రం ఇప్పటిదాకా ఆ సమస్య ఎదురు కాలేదు. ఇకపైనా అలా జరుగుతుందని అనిపించడం లేదు. మరి జక్కన్న సక్సెస్ సీక్రెట్ ఏంటి అన్నది ఆసక్తికరం. దీని గురించే ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఒక ప్రముఖ ఆన్ లైన్ ీడియా సంస్థతో జరిగిన వీడియో ఇంటర్వ్యూలో రాజమౌళి తన సక్సెస్ సీక్రెట్ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘‘విజయానికి విడిగా రహస్యం అంటూ ఏమీ ఉండదు. కానీ ఇక్కడ రెండు విషయాలు చెబుతాను. ముందుగా మనకు ప్రేక్షకులతో ఒక రిలేషన్ ఉండాలి. ఆడియన్స్ పల్స్ తెలుసుకోవాలి. అందుకు తగ్గట్లు పని చేయాలి.
రెండో విషయం.. కష్టపడడం. మనం ఎంత కష్టపడితే విజయాన్ని అంతగా ఆస్వాదించగలం. సినిమా కమర్షియల్‌గా విజయం సాధిస్తే ఆ సమయంలో పొందే ఆత్మ సంతృప్తిని వర్ణించడానికి మాటలు చాలవు. ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ముఖ్యం. ఒక సినిమా మొదలుపెట్టినపుడు అందరికీ రకరకాల సందేహాలు వస్తాయి. సినిమా విజయం సాధిస్తుందా లేదా అనిపిస్తుంది. కానీ ఎన్ని సందేహాలున్నా ఉత్సాహంగా పని చేయాలి. మనం నమ్మింది ఉత్తమంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించాలి’’ అని వివరిచాడు జక్కన్న.
This post was last modified on December 13, 2022 4:10 pm
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…
ఏపీలో కూటమి సర్కారు అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం రికార్డ్ సృష్టించింది. గత ఏడాది ప్రారంభించిన ఈ పథకం…
అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…
ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…
ఒక జాతీయ సెలవు దినం రోజు ఎనిమిది సినిమాలు విడుదలైతే ఆ వీకెండ్ మొత్తం థియేటర్లు కళకళలాడిపోవాలి. వాటిలో సగం…