గత ఏడాది విక్రమ్ తో అంతకు ముందు ఖైదీతో తమిళ ఆడియన్స్ నే కాదు తెలుగు ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ మన స్టార్ హీరోలతో ఎప్పుడు చేస్తాడా అనే ప్రశ్నకు సమాధానం దొరికిపోయింది. దగ్గరలో కాదు కదా కనీసం ఓ పది సంవత్సరాల వరకు తన డైరీ ఖాళీ లేదని కుండబద్దలు కొట్టేశాడు. ప్రస్తుతం విజయ్ తో చేయబోయే సినిమా తాలూకు స్క్రిప్ట్ పనులతో బిజీగా ఉన్న లోకేష్ ఈసారి కూడా భారీ క్యాస్టింగ్ ని సెట్ చేసుకోబోతున్నాడు. లోకి యునివర్స్ పేరుతో డెవెలప్ చేస్తున్న కాన్సెప్ట్ కి సంబంధం లేకుండా పూర్తిగా కొత్త కథను అది కూడా మాస్టర్ ని మించేలా రాసుకుంటున్నాడట.
ఇది పూర్తయ్యాక ఖైదీ 2 మొదలవుతుంది. కార్తీ ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. జైలుకు వెళ్ళడానికి ముందు ఢిల్లీ జీవితంలో ఏం జరిగిందనేది చూపించబోతున్నారు. ఆ తర్వాత విక్రమ్ 2 స్టార్ట్ చేస్తారు. కమల్ హాసన్ ఆలోగా ఇండియన్ 2తో పాటు మరో రెండు పూర్తి చేసి ఫ్రీ అవుతారు. ఆ తర్వాత సూర్యతో భారీ స్కేల్ తో రొలెక్స్ ప్లాన్ ఉంటుంది. ఎంతలేదన్నా ఒక్కోదానికి రెండేళ్ల సమయం పట్టేలా ఉంది. అది దృష్టిలో ఉంచుకునే టెన్ ఇయర్స్ ఐ యాం లాక్డ్ అని లోకేష్ స్పష్టంగా చెప్పేశాడు. రామ్ చరణ్ తో చేసే అవకాశాలు దాదాపు కనుమరుగైనట్టే. ఒకవేళ ప్లాన్ చేసుకున్నా ఇప్పట్లో జరగదు.
కోలీవుడ్ తన మొదటి ప్రాధాన్యం అంటూ చెబుతూ వస్తున్న లోకేష్ కనగరాజ్ దానికే కట్టుబడుతున్నాడు. బాలీవుడ్ నుంచి సైతం క్రేజీ ఆఫర్లు వచ్చినా తిరస్కరించి తనదైన మాఫియా ప్రపంచాన్ని సరికొత్తగా చూపించబోతున్నాడు. వీటిలో ఎక్కువ హైప్ వచ్చేది మాత్రం సూర్య నటించబోయే రోలెక్స్ కే. కేవలం అయిదు నిమిషాల క్యామియోకే విక్రమ్ థియేటర్లు దద్దరిల్లిపోయాయి. అలాంటిది ఫుల్ లెన్త్ రోల్ అది కూడా తమ్ముడు కార్తీ కాంబినేషన్ లో అంటే ఏ రేంజ్ లో ఉంటుందో వేరే చెప్పాలా. అన్నింటికి అనిరుద్ రవిచందరే సంగీతం సమకూర్చబోతున్నాడు. సో లోకేష్ ని ఇప్పుడప్పుడే ఎక్స్ పెక్ట్ చేయడం కష్టమే.
This post was last modified on December 13, 2022 12:23 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…