తెలుగు అమ్మాయి అయిన అంజలి.. తమిళంలో ఒక టైంలో మంచి రేంజికే వెళ్లింది. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలతో మంచి గుర్తింపు సంపాదించుకుని మిడ్ రేంజ్ సినిమాల్లో వరుసగా అవకాశాలు అందుకుంది. రచ్చ గెలిచాక ఇంటికి వచ్చి ఇక్కడా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘గీతాంజలి’ లాంటి చిత్రాలతో సత్తా చాటింది.
ఐతే తనతో కలిసి ‘జర్నీ’తో పాటు ‘బెలూన్’ సినిమాలో జంటగా నటించిన జైతో కలిసి ఆమె ఒక టైంలో సహజీవనం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పుడు తమ బంధాన్ని వాళ్లు దాచుకోవాలని కూడా ప్రయత్నించలేదు. జ్యోతిక నటించిన ఒక సినిమా ప్రమోషన్లో భాగంగా భార్య పక్కనుండగా దోసె వేయమంటూ సూర్య ఒక ఛాలెంజ్ ఏదో విసిరితే.. అంజలి పక్కనుండగా జై ఈ ఛాలెంజ్‌ను ట్రై చేయడం గమనార్హం. అప్పుడే వారి మధ్య బంధం బహిర్గతం అయింది. కానీ తర్వాత ఏమైందో ఏమో.. వీళ్లిద్దరూ విడిపోయారు. పెళ్లి వైపు అడుగులు వేయలేదు.
కొన్నేళ్ల నుంచి అంజలి సింగిల్‌గానే ఉంటోంది. కానీ ఇటీవల ఆమె పెళ్లి గురించి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. వాటి గురించి స్పందిస్తూ.. ఒకప్పటి తన రిలేషన్‌షిప్ గురించి కూడా కామెంట్ చేసింది అంజలి.
“కొన్నేళ్ల ముందు నేను ఒక విషపూరితమైన బంధం (టాక్సిక్ రిలేషన్‌షిప్)లో ఉన్నా. ఐతే ఇప్పుడు ఆ వ్యక్తి పేరు చెప్పాలనుకోవడం లేదు. ఆ రిలేషన్‌షిప్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నా. కానీ అది నేను ఊహించుకున్నంత అందంగా లేదు. ఇండస్ట్రీలోని వ్యక్తితో నేను రిలేషన్‌లో ఉన్నట్లు ఎక్కడా చెప్పలేదు. ఇండస్ట్రీలో నాకెంతోమంది సన్నిహితులున్నారు. నేను ఎవరితో సన్నిహితంగా ఉంటానన్నది నా వ్యక్తిగత విషయం. ఇక నాకు అమెరికాకు చెందిన ఓ వ్యక్తితో పెళ్లయిపోయిందని ఈ మధ్య వార్తలు వచ్చాయి. వాటిలో ఎలాంటి నిజం లేదు. నన్ను అన్ని విధాలా గౌరవించే వ్యక్తి దొరికినపుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటా” అని అంజలి పేర్కొంది.
This post was last modified on December 13, 2022 11:24 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…