నిఖిల్ సిద్దార్థ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కార్తికేయ 2 భారీ వసూళ్లు అందుకుంది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ కథ రెడీ అవుతుంది. కార్తికేయ సినిమా వచ్చిన చాలా ఏళ్లకు మళ్ళీ అదే టైటిల్ తో సరికొత్త కథ రాసుకున్నాడు చందూ మొండేటి. కార్తికేయ 2 ఎవరూ ఊహించని విధంగా అవలీలగా వంద కోట్ల మార్క్ కి చేరుకుంది. నార్త్ లో మంచి వసూళ్ళు రాబట్టి టాలీవుడ్ కి షాకిచ్చింది. ‘కార్తికేయ 2’ కి వచ్చిన రెస్పాన్స్ చూసి ఎక్కువ ఆలస్యం చేయకుండా దానికి సీక్వెల్ చేసే ప్లానింగ్ లో ఉన్నాడట దర్శకుడు చందూ మొండేటి. ఇప్పటికే ఒక పాయింట్ అనేసుకొని కథ రెడీ చేస్తున్నాడని తెలుస్తుంది.
ఇటివల నిఖిల్ తో ఆ పాయింట్ డిస్కస్ చేసి లాక్ చేసుకున్నాడట దర్శకుడు. కార్తికేయ 2 ని నిర్మించిన అభిషేక్ అగర్వాల్ , విశ్వప్రసాద్ నే కార్తికేయ 3 నిర్మించనున్నారని తెలుస్తుంది. కార్తికేయ 2 తర్వాత చందూ మొండేటి గీతా ఆర్ట్స్ కి ఓ సినిమా చేయాల్సి ఉంది. కొన్ని కథలకు సంబందించి నెరేషన్స్ జరిగాయి. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టేసి కార్తికేయ 3 ని రెడీ చేసే పనిలో ఉన్నాడట చందూ.
కార్తికేయ 2 అంత సక్సెస్ అవ్వడానికి రీజన్స్ అందులో ఉన్న కృష్ణతత్వం, అలాగే ట్రెజర్ హంట్ సీక్వెన్స్ . ఈ రెండు విజయంలో కీలక పాత్ర పోషించాయి. మరి కార్తికేయ 3 లో అలాంటి డెవోషనల్ పాయింట్ తో పాటు ఎగ్జైటింగ్ గా చూడగలిగే స్క్రీన్ ప్లే వర్కౌట్ అయితే మరోసారి నిఖిల్ చందూ కాంబో మరోసారి మంచి వసూళ్ళు రాబట్టే అవకాశం ఉంది. కార్తీకేయ 2 క్రేజ్ ఎలాగో ఉంది కాబట్టి బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరగొచ్చు. ప్రస్తుతం నిఖిల్ మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది చివర్లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళే చాన్స్ కనిపిస్తుంది.
This post was last modified on December 12, 2022 9:53 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…