అల్లు అర్జున్ , సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘పుష్ప 1’ తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరుగా పెర్ఫార్మ్ చేసినప్పటికీ నార్త్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. ముఖ్యంగా పుష్ప మేనరిజం నార్త్ లో బాగా క్లిక్ అయింది. దీంతో పుష్ప 2 పై అక్కడ కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకే పుష్ప 2 ని భారీ లెవెల్ లో ప్రమోట్ చేసే ప్లానింగ్ రెడీ చేసుకున్నారు మేకర్స్. ఇప్పటి వరకూ షూటింగ్ అప్ డేట్ కూడా ఇవ్వకుండా దాచి ఉంచిన యూనిట్ త్వరలోనే ఓ గ్లిమ్స్ ద్వారా పుష్ప 2 ఎలా ఉండబోతుందో విజువల్ గా చెప్పాలని భావిస్తున్నారు. ఫ్యాన్స్ ను అలాగే వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ ను మెస్మరైజ్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే ఓ పవర్ ఫుల్ డైలాగ్ తో అదిరిపోయే విజువల్స్ తో షూట్ చేసిన భాగాన్ని గ్లిమ్స్ గా మార్చే వర్క్ జరుగుతుంది.
పుష్ప 2 గ్లిమ్స్ ను అవతార్ 2 సినిమాతో జత చేయాలని ప్లాన్ చేశారు. ఈ దెబ్బతో పాన్ ఇండియా లెవెల్ లో పుష్ప ది రూల్ భారీ బజ్ అందుకోవడం ఖాయమని అనుకున్నారు. కానీ ఇప్పుడు మేకర్స్ ఈ గ్లిమ్స్ కోసం ఇంకా టైం తీసుకోనున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇంకా వర్క్ పెండింగ్ ఉండటంతో గ్లిమ్స్ ను పోస్ట్ పోన్ చేసుకొని న్యూ ఇయర్ కి న్యూ ట్రీట్ ఇవ్వాలని చూస్తున్నారని సమాచారం.
అవతార్ 2 సినిమాకు పుష్ప 2 గ్లిమ్స్ జత చేయడం లేదని తెలియగానే గీతా ఆర్ట్స్ సంస్థ ముందడుగేసింది. పుష్ప 2 టీజర్ కి బదులు 18 పేజేస్ ట్రైలర్ ని జత చేసే ప్లానింగ్ రెడీ చేసుకున్నారు. సో బన్నీ సినిమా గ్లిమ్స్ రాకపోయినా బన్నీ సొంత ప్రొడక్షన్ సినిమా ట్రైలర్ అవతార్ తో రాబోతుందన్నమాట. ఏదేమైనా అవతార్ 2 క్రేజ్ ను నిఖిల్ అండ్ టీం తమ సినిమాకి పర్ఫెక్ట్ గా వాడుకోబోతున్నారు.
This post was last modified on December 12, 2022 9:47 pm
మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ రానే వచ్చింది. నిన్న సాయంత్రమే ‘పుష్ప: ది రూల్’ ట్రైలర్ను వివిధ భాషల్లో లాంచ్ చేశారు.…
రానాను చిరంజీవి కొట్టడం ఏంటి.. అంత తప్పు ఏం చేశాడు.. రానాను కొట్టేంత చనువు చిరుకు ఉందా అని ఆశ్చర్యపోతున్నారా?…
‘పుష్ప: ది రైజ్’ సినిమాలో మిగతా హైలైట్లన్నీ ఒకెత్తయితే.. సమంత చేసిన ఐటెం సాంగ్ మరో ఎత్తు. అప్పటిదాకా సమంతను…
కోలీవుడ్లో పిన్న వయసులోనే మంచి పేరు సంపాయించుకున్నయువ హీరో దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్కు సంబంధం లేకుండా..…
జైలర్ లో చేసింది క్యామియో అయినా తెలుగు తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్…
వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న కారణంతో అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదని పులివెందుల ఎమ్మెల్యే జగన్ చెబుతున్న సంగతి తెలిసిందే.…