గత ఏడాది ఇదే నెలలో ‘పుష్ప’ అనే సినిమా రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. తెలుగులో మంచి అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమాకు ఇతర భాషల్లో అంతగా హైప్ లేదు. కానీ హిందీ, తమిళ భాషల్లో తెలుగును మించి ఈ సినిమా విజయం సాధించింది. ఉత్తరాది జనాలను అయితే ‘పుష్ప’ మామూలుగా ఊపేయలేదు. అక్కడి నుంచి ఆ సినిమా క్రేజ్ ఇంటర్నేషనల్ లెవెల్‌కు వెళ్లిపోయింది. దీంతో ‘పుష్ప-2’ మీద అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఆ అంచనాలను అందుకునే దిశగా సుకుమార్ అండ్ టీం బాగానే కష్టపడుతోంది.
ముందు అనుకున్నదానికంటే ఎక్కువ సమయం తీసుకుని స్క్రిప్టు తీర్చిదిద్దుకుని ఇటీవలే ‘పుష్ప-2’ చిత్రీకరణ మొదలుపెట్టారు. ముందుగా ఒక కాన్సెప్ట్‌తో టీజర్ విజువల్స్ తీసుకుని.. ఆ తర్వాత రెగ్యులర్ షూట్‌కు వెళ్లారు. ఇంకో ఐదు రోజుల్లో ‘పుష్ప’ వార్షికోత్సవం జరగబోతోంది. ఆ రోజే ‘పుష్ప-2’ ఫస్ట్ టీజర్ లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం.
ఒక సెన్సేషనల్ ఫస్ట్ లుక్‌తో పాటు ‘పుష్ప-2’ కాన్సెప్ట్ టీజర్ కూడా ఈ సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ‘పుష్ప-2’లో బన్నీ పులితో ఫైట్ చేయబోతున్నాడని కొంత కాలంగా జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అందుకోసం బన్నీ శిక్షణ కూడా తీసుకున్నట్లు వార్తలొచ్చాయి. ఐతే ‘పుష్ప-2’ టీజర్ పులి చుట్టూనే తిరుగుతుందట కానీ.. పులితో ఫైట్ లాంటిదేమీ ఉండదన్నది విశ్వసనీయ సమాచారం.
పుష్ప అడవిలో అడుగు పెడితే పులి అతణ్ని చూసి వెనుకడుగు వేయడం.. ఈ క్రమంలో ‘‘అడవిలో జంతువులు నాలుగు అడుగులు వేశాయంటే పులి వచ్చిందని అర్థం. అదే పులి నాలుగు అడుగులు వేసిందంటే పుష్ప రాజ్ వచ్చాడని అర్థం’’ అనే డైలాగ్ బ్యాగ్రౌండ్లో వినిపిస్తుందట. ఈ డైలాగ్ ఆల్రెడీ సోషల్ మీడియాలో లీక్ అయి చక్కర్లు కొడుతోంది. టీజర్ కథ ఇలా ఉంటే.. దీంతో పాటుగా రిలీజ్ చేయబోయే ఫస్ట్ లుక్‌లో బన్నీ ఒక స్టన్నింగ్ అవతారంలో కనిపించనున్నాడని సమాచారం. ఆ అవతారం ఎవరి ఊహకూ అందని విధంగా ఉంటుందట.
This post was last modified on December 12, 2022 9:39 pm
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…