Movie News

ఆహా ఎన్ని లీకులో ?

అన్ స్టాపబుల్ 2 సీజన్ లో భాగంగా బాలయ్య ప్రభాస్ తో ఓ ఎపిసోడ్ చేస్తున్నాడనే న్యూస్ వచ్చినప్పటి నుండి ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు వస్తుందా ? అని వెయిట్ చేయసాగారు ఓటీటీ ఆడియన్స్. అయితే అన్ స్టాపబుల్ కి సంబంధించి లిస్టు ప్రిపేర్ అయ్యే ముందే బయటికి లీకులు వచ్చేస్తుంటాయి. ఇది ఆహా పబ్లిసిటీ స్ట్రాటజీ అనుకోవచ్చు. అయితే గెస్ట్ ఎవరనేది ముందే లీక్ అవ్వడం బాగానే ఉంది కానీ షో లో వచ్చే కంటెంట్ కూడా లీకైతేనే ప్రాబ్లం.

తాజాగా ప్రభాస్ ఎపిసోడ్ కి సంబంధించి కంటెంట్ లో చాలా విషయాలు లీకయ్యాయి. బాలయ్య ప్రభాస్ పెళ్లి గురించి అడగడం , చరణ్ వీడియో కాల్ చేయడం , ఆ కాల్ లో ప్రభాస్ త్వరలోనే ఓ గుడ్ న్యూస్ చెప్పనున్నాడు అంటూ చరణ్ చెప్పడం , ప్రభాస్ బాలయ్య కి స్పెషల్ ఫుడ్ తీసుకురావడం ఇలా మెజారిటీ విషయాలన్నీ లీకులుగా బయటికొచ్చేశాయి. అయితే షో లో ప్రభాస్ ఉండగానే సోషల్ మీడియాలో ఫోటోలు బయటికొచ్చాయి. షోలో కొందరు ఆడియన్స్ కూడా ఉంటారు. వాళ్ళల్లో ఎవరైనా ఫోటోలో తీస్తే ఆహా టీం జాగ్రత్త తీసుకోదా ? అసలు షూట్ లో ఫోన్ లను ఎలా అలో చేస్తున్నట్టు ?

ఇక ఫోటోనే కాదు ప్రభాస్ తో బాలయ్య ఏదో మాట్లాడుతున్న వీడియో కూడా వచ్చేసింది. ఇదంతా ఆహా ప్లానేనా ? ప్రభాస్ ఎపిసోడ్ మీద హైప్ పెంచేందుకు ఇదంతా చేస్తున్నారా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా షో లో జరిగే ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ బయటికోచ్చేస్తే రేపు ఎపిసోడ్ చూసే వారికి అంత కిక్ ఉండకపోవచ్చు. అన్ స్టాపబుల్ సీజన్ 1 లో మహేష్ ఎపిసోడ్ ని ఇలానే ఆహా టీం గట్టిగా ప్రమోట్ చేసింది. కొన్ని లీకులు కూడా వదిలింది. ఇప్పుడు సీజన్ 2 లో బిగ్గెస్ట్ గెస్ట్ ప్రభాస్ కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఈ ఎపిసోడ్ ను హైలైట్ చేస్తున్నారు. మరి ఆహా లీకుల వెనుకున్నది ఎవరో ?

This post was last modified on December 12, 2022 9:37 pm

Share

Recent Posts

బిర్యానీ తినడానికే పుట్టినవారు జంతువులు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…

1 hour ago

ఆరుగురు పతివ్రతలు మళ్ళీ వస్తున్నారు

కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా న‌డుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…

1 hour ago

డెకాయిట్ అత్యాశని దృశ్యం 3 వాడుకుంది

బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…

2 hours ago

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

4 hours ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

6 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

9 hours ago