‘అర్జున్ రెడ్డి’ చిత్రం ఘన విజయం సాధించిన తరువాత షాలినీ పాండేకి పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు ఏవీ రాలేదు. అడపాదడపా చిత్రాల్లో కనిపించినా… తన మొదటి సినిమా రేంజ్ సక్సెస్ చూడలేదు. అయితేనేం సోషల్ మీడియాలో మాత్రం ఆమె అభిమానులను అలరిస్తోంది.
ఇన్స్టాగ్రామ్ మాధ్యమం ద్వారా రీల్స్, ఫోటోలతో బాగా యాక్రివ్ గా ఉంటోంది. తాజాగా తన పెంపుడు కుక్కలతో ఆమె బీచ్ లో ఆడుకుంటున్న వీడియో ఒకటి పోస్ట్ చేసింది. ఇందులో నల్ల షార్ట్, ఇన్నర్ టాప్ వేసుకున్న షాలినీ చలికాలంలో అందరి హీట్ పెంచేసిందనే చెప్పాలి.
సరదాగా సముద్రం ఒడ్డున తన కుక్కలతో కేరింతలు కొడుతూ షాలినీ పెట్టిన వీడియో బాగా వైరల్ అయింది. అర్జున్ రెడ్డి సినిమాలో బొద్దుగా ముద్దుగా ఉన్న షాలినీ పాండే ఇప్పుడు చాలా సన్నగా తయారయింది కానీ ఆమె అందం, సొట్ట బుగ్గలు మాత్రం అలాగే ఉన్నాయి.
మొత్తానికి సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఇలా అప్పుడప్పుడూ పెంపుడు జంతువులతో సేద తీరుతూ షాలినీ పాండే లైఫ్ ను బాగానే ఎంజాయ్ చేస్తోంది. ఇక త్వరలో తనని మళ్లీ వరుస సినిమాలతో సిల్వర్ స్క్రీన్ పైన చూడాలి అని కోరుకుందాం.
This post was last modified on December 13, 2022 2:52 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…