మొన్న శుక్రవారం మహా సందడిగా పదికి పైగా చిన్న సినిమాలు బాక్సాఫీస్ మీద దాడి చేస్తే కనీసం ఒక్కటంటే ఒక్కటి కనీస ప్రభావం చూపించే స్థాయిలో లేకపోవడంతో ట్రేడ్ కి మరో బ్లాక్ ఫ్రైడే తప్పలేదు.
కనీసం థియేటర్ నిర్వహణ ఖర్చులు కూడా రాబట్టలేనంత వీక్ గా రిపోర్ట్స్ తెచ్చుకోవడంతో అసలే చలి వర్షంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రేక్షకులు వీటిని చూసేందుకు ఆసక్తి చూపించలేదు. పబ్లిసిటీ పరంగా ముఖచిత్రంకు హడావిడి బాగానే చేశారు కానీ రాంగ్ క్యాస్టింగ్, ఫస్ట్ హాఫ్ ల్యాగ్, డ్రామాని డామినేట్ చేసిన మెసేజ్ ఇవన్నీ దెబ్బేశాయి. లాయర్ గా విశ్వక్ సేన్ క్యామియో సైతం ఆకట్టుకోలేదు
ఇక గుర్తుందా శీతాకాలంని రిలీజ్ రోజు మ్యాట్నీకే ఆడియెన్స్ మర్చిపోయారు. ఇంత నీరసమైన ప్రేమకథలో సత్యదేవ్ లాంటి పవర్ ఫుల్ నటుడిని చూపించే ప్రయత్నం అడ్డంగా బెడిసి కొట్టింది. రీమేక్ హక్కులు కొనే ముందు మన జనాల టేస్ట్ కు సూట్ అవుతుందా లేదా చెక్ చేసుకోకపోతే జరిగే పరిణామాలను మరోసారి చూపించింది.
పంచతంత్రంను చూసిన కొద్దిగొప్పో క్లాస్ జనాలు పర్వాలేదనే సర్టిఫికెట్ ఇచ్చినా ఇలాంటివి వెబ్ సిరీస్ లో అలవాటయ్యాక ఖర్చు పెట్టుకుని మరీ టికెట్లు కొని చూసే మూడ్ లో పబ్లిక్ లేరు. ఇక లెహరాయి, చెప్పాలని ఉంది, వర్మ మా ఇష్టం, @లవ్, విజయానంద్ ఇవన్నీ షోలు క్యాన్సిలైనవే ఎక్కువ.
దెబ్బకు హిట్ 2 ది సెకండ్ కేస్ అంతోఇంతో మెరుగైన వసూళ్లు రాబట్టడం విశేషం. మరీ తీవ్రంగా కాదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మాత్రం పికప్ కావడం మంచిదే. మసూద సైతం అలాగే నెట్టుకొస్తోంది.
అవతార్ 2కు భయపడి ఒకేసారి ఇన్నేసి సినిమాలు డిసెంబర్ 9న కలబడటం వల్ల నిర్మాతలకు బయ్యర్లకు ఇద్దరికీ కలిగిన ప్రయోజనం శూన్యం. థియేటర్ రిలీజ్ జరిగిపోయింది కాబట్టి ఓటిటికి రూట్ క్లియర్ అవ్వడం తప్ప ఒరిగిందేమి లేదు. ఎలాగూ జనాలు అవతార్ 2కి రెడీ అవుతున్నారు కాబట్టి ఈ నాలుగు రోజులు సినిమా హాళ్లకు దినదిన గండమే. మరీ ముఖ్యంగా బిసి సెంటర్లలో మరీ తీవ్రంగా ఉండనుంది.
This post was last modified on December 12, 2022 12:48 pm
అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…