మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు బాబీ కాంబినేషన్ లో రూపొందుతున్న వాల్తేరు వీరయ్య మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే. బాస్ పార్టీ సాంగ్ ఇప్పటికే పాతిక మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతూ ఉండగా మాస్ మహారాజా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు తమ హీరో ఇంట్రోని చూద్దామా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
వాళ్ళ అంచనాలని మించేలా పవర్ ని మించి ఊర మాస్ ఖాకీని రవితేజని చూపించేశారు. కేవలం నిమిషంలోపే ఉన్న వీడియో టీజర్ లో విక్రమ్ సాగర్ ఏసిపిగా చేతిలో మేకపిల్లను పట్టుకుని సిలిండర్ ని గొడ్డలితో లాక్కొస్తున్న షాట్ లో మాములు ఎలివేషన్ లేదు.
బ్యాక్ గ్రౌండ్ లో మొదటిసారి మేకపిల్లను ఎత్తుకొస్తున్న పులి అంటూ ఇచ్చిన వాయిస్ ఓవర్ సైతం రచ్చ అనిపిస్తోంది. చివరిలో నేను ఎవని అయ్యా మాట విననని చెప్పే రవితేజ షాట్ తో హైప్ ని అమాంతం పెంచేశారు.
దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ లో మరీ హై లేకపోయినా సీన్స్ ని మంచి డెప్త్ తో డిజైన్ చేసుకున్న బాబీ ఏ మాత్రం నిరాశపరచలేదు. కాకపోతే చిరంజీవితో కాంబో సీన్ ఏదైనా చూపిస్తారేమోనని ఆశపడిన మూవీ లవర్స్ కోరిక నెరవేరలేదు. అది మాత్రం పూనకాలు లోడింగ్ పాట రిలీజయ్యే దాకా ఆగాల్సిందే. మొత్తానికి వాల్తేరు వీరయ్యకి మాస్ రాజా ఎంట్రీ మంచి జోష్ ఇచ్చింది.
ఇందులో రవితేజ పోలీస్ ఆఫీసర్ అనే క్లూ ముందుగా ఇచ్చేశారు కాబట్టి ఆ కోణంలో సస్పెన్స్ ఏమీ లేదు కానీ ఎలా ఉండబోతోందన్న క్లారిటీ అయితే వచ్చేసింది. రిలీజుకు కేవలం నెల రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో మైత్రి మూవీ మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచాల్సి ఉంది.
వీరసింహారెడ్డిని బాలన్స్ చేసుకుంటూనే వీరయ్యకి పబ్లిసిటీ ఇవ్వాల్సి ఉంటుంది. అసలే రెండు సినిమాలకు మొత్తం మూడు పాటల షూటింగ్ ఆఘమేఘాల మీద జరుగుతోంది. డిసెంబర్ చివరి నాటికి ఫస్ట్ కాపీ సిద్ధంగా ఉంచుకుని సెన్సార్ కు వెళ్తే తప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్లలు ఒత్తిడి ఉండదు. దానికి తగ్గట్టే ప్లానింగ్ జరుగుతోంది
This post was last modified on December 12, 2022 4:00 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…