ఎంత ప్రతిభ ఉన్నా సత్యదేవ్ కో పెద్ద హిట్టు అందని ద్రాక్షగానే మిగులుతోంది. శ్రమలోపం లేకుండా ఎంత కష్టపడుతున్నా దానికి తగ్గ ఫలితం దక్కడం లేదు. తాజాగా విడుదలైన గుర్తుందా శీతాకాలం తన ఖాతాలో మరో డిజాస్టర్ ని వేసింది. మిల్కీబ్యూటీ తమన్నా గ్లామర్, ఊళ్లు తిరుగుతూ టీమ్ ప్రత్యేకంగా చేసిన ప్రమోషన్లు ఇవేవీ ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. కన్నడలో మంచి విజయం సాధించిన లవ్ మాక్ టైల్ రీమేక్ గా రూపొందిన ఈ లవ్ కం ఎమోషనల్ ఎంటర్ టైనర్ కనీసం యూత్ ని మెప్పించడంలోనూ తడబడింది. ఫీల్ గుడ్ పేరుతో సాగదీసిన భావోద్వేగాలను తామూ ఇష్టపడమని తేల్చి చెప్పడంతో వసూళ్లు తేలిపోయాయి.
ఓ యువకుడి జీవితంలో ఎదురైన ప్రేమకథల అల్లికగా దర్శకుడు నాగశేఖర్ రూపొందించిన గుర్తుందా శీతాకాలం త్వరగా మర్చిపోయేంత నీరసంగా తయారయ్యింది. ఇప్పటికే ఇలాంటి లైన్ లో ఎన్నో సినిమాలు తెలుగులోనే వచ్చాయి.ఈ మాత్రం దానికి మళ్ళీ శాండల్ వుడ్ నుంచి ఎందుకు తీసుకొచ్చారో అర్థం కాదు. పోనీ ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ఉంటే ఏదో టైం పాస్ కైనా ఉపయోగపడేది. కానీ అలా జరగలేదు. పాటలు ఒకటి రెండు మ్యూజికల్ గా కనెక్ట్ అయ్యేలా ఉంటే ఆ రూపంలోనూ ఆడియన్స్ ని ఆకర్షించే అవకాశం ఉండేది. సంగీత దర్శకుడు దాన్నీ సరిగా వాడుకోలేదు.
మొత్తానికి సత్యదేవ్ కు ఇంకోసారి బ్యాడ్ లక్ తలుపు తట్టేసింది. గాడ్ ఫాదర్ లో పెర్ఫార్మన్స్ కి ఎన్ని ప్రశంసలు వచ్చినా అది బ్లాక్ బస్టర్ కాకపోవడంతో పేరైతే వచ్చింది కానీ ఇమేజ్ నేం పెంచలేదు. పైగా మొదటి నాలుగు రోజుల తర్వాత ప్రమోషన్లను పూర్తిగా ఆపేయడంతో పైకి నెంబర్లైతే చూపించారు కానీ థియేటర్లలో జనం క్రమంగా తగ్గిపోయారు. సో సత్యదేవ్ ఆశలన్నీ రాబోయే కృష్ణమ్మ మీదే ఉన్నాయి. రా బ్యాక్ డ్రాప్ లో బాగా మాస్ టచ్ ఉన్న క్యారెక్టర్ లో కనిపిస్తున్నాడు. కొరటాల శివ పర్యవేక్షణ కాబట్టి ఇది కనక బ్రేక్ ఇస్తే మార్కెట్ ని పెంచుకునే విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా విడుదల తేదీ ఖరారు చేయలేదు.
This post was last modified on %s = human-readable time difference 5:17 pm
ఏపీ సీఎం చంద్రబాబు అంటే రాష్ట్రంలోని మహిళలకు ప్రత్యేకమైన గౌరవం ఉన్న సంగతి తెలిసిందే. డ్వాక్రా సంఘాలను ఏపీ మహిళలకు…
విశాఖకు మణిహారంగా ఉన్న రుషికొండపై ప్రజాధనాన్ని వ్యర్థం చేస్తూ ప్యాలెస్ ను మాజీ సీఎం జగన్ నిర్మించుకున్న సంగతి తెలిసిందే.…
దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ వెలిగిపోతోంది. కన్నడ అనువాదం ‘బఘీర’ను మినహాయిస్తే మూడు సినిమాలూ బాక్సాఫీస్ దగ్గర బాగా సందడి చేస్తున్నాయి.…
ఆగస్టు 15 వీకెండ్లో ‘స్త్రీ-2’ అనే మిడ్ రేంజ్ సినిమా ఒకటి రిలీజైంది. దాంతో పాటు అక్షయ్ కుమార్ ముఖ్య…
తెలంగాణ రాజకీయాలు రసపట్టుగా మారుతున్నాయి. ఇప్పుడు రాజకీయం అంతా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల మధ్య జరుగుతుందనుకుంటున్న తరుణంలో…
పటాసుల పండగ అయిపోయింది. బాక్సాఫీస్ మతాబులు పెద్ద శబ్దం చేస్తూ భారీ ఎత్తున ట్రేడ్ కు సంబరాలు తెచ్చిపెట్టాయి. వందల…