మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం జనవరి 13వ తేదీన సంక్రాంతికి విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు టీజర్ ట్రైలర్ విడుదల కాలేదు కానీ ‘బాస్ పార్టీ’ అనే పాట మాత్రం రిలీజ్ చేశారు.
దేవిశ్రీప్రసాద్ సంగీతంలో చిత్రీకరించిన ఈ పాట అభిమానులకు తెగ నచ్చేసింది. ముఖ్యంగా ‘వేర్ ఈజ్ ద పార్టీ’ అనే లిరిక్ వద్ద మెగాస్టార్ చిరంజీవి వేసిన స్టెప్పులు పాత రోజులను తలపించాయి. ఇక ఈ స్టెప్పులు అతని అభిమానులంతా రిపీట్ చేసి ఇన్స్టా గ్రామ్ లో పెట్టేస్తున్నారు.
ఇంతకీ విషయం ఏమిటంటే.. చిరంజీవి మనవరాలు కూడా ఈ సినిమా పాట స్టెప్పులను వేయగా ఆమె తల్లి, మెగాస్టార్ కూతురు అయిన సుస్మిత కొణిదెల తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. సుస్మిత కొణిదెల ప్రస్తుతం చిరంజీవికి కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తోంది. యూరప్ లో ఒక పాట చిత్రీకరణ కోసం ‘వాల్తేరు వీరయ్య’ చిత్ర బృందం మొత్తం అక్కడికి వెళ్లారు.
ఇక ‘బాస్ పార్టీ’ పాటకు స్టెప్పులు సమకూర్చిన శేఖర్ మాస్టర్ తో ఈ పాటకి సుస్మిత కొణిదెల పెద్ద కూతురు కూడా మంచులో “బాసు వేర్ ఇస్ ద పార్టీ” అంటూ స్టెప్పులు వేయగా సుస్మిత తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఆ వీడియోని అభిమానులతో పంచుకుంది.
This post was last modified on December 11, 2022 9:10 pm
భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పపై ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) మోసం కేసులో అరెస్ట్ వారెంట్ జారీ కావడం సంచలనంగా…
మాములుగానే రష్మిక మందన్న హైపర్ యాక్టివ్ గా మాట్లాడుతుంది. అది ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా లేక మరో వేదిక…
నిన్న విడుదలైన ఉపేంద్ర యుఐకి విచిత్రమైన టాక్ నడుస్తోంది. సోషల్ మీడియాలో ఇంటెలిజెంట్ మేకింగ్, అర్థం చేసుకున్నోళ్లకు అర్థం చేసుకున్నంత…
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…