ఒక సినిమా పూర్తి చేశాక కొన్నిసార్లు హీరో లేదా హీరోయిన్.. ఆ సినిమాతో తమకేం సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తుంటారు. ప్రమోషన్లకు దూరంగా ఉండడం, ఆ సినిమా గురించి ఎక్కడా మాట్లాడకపోవడం చర్చనీయాంశం అవుతుంటుంది. ఇందుకు పారితోషకం విషయంలో గొడవ కారణం కావచ్చు. లేదా సినిమా ఔట్ పుట్ తేడా కొట్టి అది తమ కెరీర్‌కు ఉపయోగపడదని భావించవచ్చు. ముందు చెప్పినట్లు తమ పాత్రకు ప్రాధాన్యం లేకపోవడం బాధించవచ్చు.
ఈ మధ్య గుర్తుందా శీతాకాలం సినిమాను Tamanna భాటియా అస్సలు పట్టించుకోకపోవడంతో ఇందుకు దారితీసిన కారణం ఏంటా అని అందరూ చర్చించున్నారు. రిలీజ్‌కు వారం ముందు వరకు ఆమె ఈ సినిమాతో తనకు ఏ సంబంధం లేదన్నట్లే వ్యవహరించింది. కొన్నేళ్లుగా తన సినిమాలకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటున్న తమ్మూ.. ఈ సినిమాకు మాత్రం అలా చేయలేదు.
దీంతో ఏం జరిగిందా అని అందరిలోనూ సందేహాలు నెలకొన్నాయి. ఐతే విడుదల ముంగిట చిత్ర బృందం ఎలాగోలా Tamanna ను ఒప్పించి ప్రమోషన్లకు తీసుకొచ్చారు. ప్రి రిలీజ్ ఈవెంట్‌తో పాటు ప్రెస్ మీట్‌కు కూడా హాజరైంది మిల్కీ బ్యూటీ. కట్ చేస్తే ఈ రోజు గుర్తుందా శీతాకాలం సినిమా రిలీజైంది.
అందులో Tamanna కు కీలక పాత్రే దక్కింది. సినిమాలో మెయిన్ హీరోయిన్ ఆమే అని చెప్పాలి. మరి తమన్నాకు సినిమాలో ఏం రుచించలేదా అని చూస్తే.. తన పాత్రను తీర్చిదిద్దిన, ముగించిన విధానమే కావచ్చని అనిపిస్తోంది. ఈ సినిమాలో తమన్నా పాత్రకు ట్రాజిక్ ఎండింగ్ ఇచ్చారు. ఆమెను క్యాన్సర్ పేషెంట్‌గా చూపించడం గమనార్హం. అలా అని సన్నివేశాలేమీ పైపైన లేవు. ట్రీట్మెంట్లో భాగంగా జుట్టు ఊడిపోవడం, గుండు చేయించుకోవడం లాంటి సీన్లు పెట్టారు. తమన్నా లాంటి బ్యూటీని అలాంటి సీన్లలో చూసి అభిమానులు షాకవడం ఖాయం.
మొత్తంగా కూడా Tamanna లుక్స్ ఈ సినిమాలో ఏమంత బాగా లేవు. ఇలాంటి పాత్రలను చేస్తే గ్లామర్ రోల్స్ తగ్గిపోతాయి. సైజ్ జీరో తర్వాత అనుష్క మీద పడ్డ నెగెటివ్ ఎఫెక్ట్ తెలిసిందే. నటించడం ఎలాగో నటించేసి ఉండొచ్చు కానీ.. ఈ పాత్రను ఇలా చూపించడం నచ్చక, ఈ సినిమా తన కెరీర్‌కు నెగెటివ్ అవుతుందనే తమన్నా ముందు ఈ చిత్ర ప్రమోషన్లకు దూరంగా ఉందేమో అనిపిస్తోంది.
This post was last modified on December 10, 2022 12:03 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…