జనసేన పార్టీ వ్యవస్థాపకుడు, స్టార్ సినీ హీరో పవన్ కళ్యాణ్ ఈమధ్య సోషల్ మీడియా మాధ్యమంలో చాలా చురుకుగా ఉంటున్నారు. పార్టీ సంబంధిత పోస్టులలతో పాటు సినీ అభిమానులు హర్షించే విధంగా కూడా ఆయన ట్వీట్లు, పోస్టులు పెడుతున్నారు.
ఇక ఈరోజు ఆయన తాజాగా వేసిన పోస్టు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించింది. తీక్షనమైన కంటిచూపుతో ఎడమ చేతిలో ఒక మీడియం సైజు కత్తి పట్టుకొని మార్షల్ ఆర్ట్స్ కసరత్తు చేస్తున్న ఒక ఫోటోను ఆయన సోషల్ మీడియాలో వేశారు. కింద “రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ మొదలుపెట్టాను” అంటూ ఒక క్యాప్షన్ కూడా పెట్టడం జరిగింది.
ఇక ఈ ఫోటోని చూసి పవన్ అభిమానులు ఉత్సాహంతో ఊగిపోయారు. వెంటనే ఆ చిత్రాన్ని తమ ప్రొఫైల్ ఫోటోలుగా పెట్టుకోవడం కూడా మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

ఇందుకు సంబంధించి కళ్యాణ్ ఇటువంటి సాధనలు ఎన్నో చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ చిత్రాన్ని కూడా పెత్తి ఉంటారు అని అందరూ అనుకుంటున్నారు.
గతంలో కూడా గన్ ఫైరింగ్ చేస్తున్న వీడియోని పోస్ట్ చేసిన కళ్యాణ్ ఇప్పుడు ఇలా కత్తులతో సమరానికి సై అంటూ పోస్ట్ వేయడం అతని అభిమానులను రంజింపచేస్తుంది.
త్వరలోనే సుజిత్ తో మరొక సినిమా చేయబోతున్న పవన్ కళ్యాణ్ ఈ నెల 11వ తేదీన ప్రకటించనున్న హరీష్ శంకర్ దర్శకత్వంలో ఇంకొక చిత్రంలో కూడా హీరోగా కనిపించనున్నాడు.
ఒకదాని తర్వాత ఒకటిగా ఇలా పవన్ కళ్యాణ్ అభిమానులకు వరుస తన సినిమా అనౌన్స్మెంట్లతో, ఫోటోలతో పవన్ కళ్యాణ్ తన అభిమానులను తెగ అలరింపజేస్తున్నారు అనే చెప్పాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates