టాలీవుడ్లో మంచు మనోజ్ అనే హీరో ఒకరున్నారనే విషయాన్ని జనాలు నెమ్మదిగా మరిచిపోతున్నారు. ఆరంభంలో కొంచెం తడబడ్డా.. ఆ తర్వాత నేను మీకు తెలుసా, ప్రయాణం, బిందాస్, వేదం, మిస్టర్ నూకయ్య, పోటుగాడు, కరెంటు తీగ లాంటి చిత్రాలతో అతను బాగానే ఆకట్టుకున్నాడు. వీటిలో బిందాస్, పోటుగాడు, కరెంటు తీగ చిత్రాలు కమర్షియల్‌గా కూడా మంచి ఫలితాన్ని అందుకున్నాయి.
మంచు ఫ్యామిలీ రెండో తరంలో అత్యంత ప్రామిసింగ్‌గా కనిపించింది మనోజే. ఏదో కొత్తగా చేయడానికి ట్రై చేస్తాడని అతడి మీద ప్రేక్షకుల్లో పాజిటివ్ ఇంప్రెషన్ ఉండేది. కానీ వరుస ఫెయిల్యూర్లు ఎలాంటి హీరోనైనా షేక్ చేస్తాయనడానికి మనోజ్ ఉదాహరణగా నిలిచాడు. 2017లో వచ్చిన ‘ఒక్కడు మిగిలాడు’ తర్వాత అతను హీరోగా సినిమాలే చేయలేదు. మూడేళ్లకు పైగా గ్యాప్ తర్వాత ‘అహం బ్రహ్మాస్మి’ పేరుతో పాన్ ఇండియా సినిమాను మనోజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా గురించి ఏడాదిగా ఏ న్యూస్ బయటికి రాలేదు. సైలెంటుగా షూటింగ్ చేస్తున్నాడేమో అని కొన్నాళ్లు అనుకున్నారు కానీ.. చివరికి చూస్తే ఆ సినిమాను మనోజ్ పక్కన పెట్టేసినట్లు స్పష్టమవుతోంది. తాజాగా ట్విట్టర్లో మంచు మనోజ్ స్పందనే ఇందుకు నిదర్శనం.
మనోజ్ తాజాగా ఒక ఫొటో షేర్ చేసి దానికేదో క్యాప్షన్ పెడితే.. ఇంతకీ నీ ‘బ్రహ్మాస్త్రం’ ఏమైందన్నా అంటూ ఒక అభిమాని ప్రశ్నించాడు. దానికి ఒక స్మైలీ ఎమోజీ జోడించి ఊరుకున్నాడు మనోజ్. మరో ట్విట్టర్ పాలోయర్ సైతం ఇదే విషయం ప్రస్తావిస్తూ ‘అహం బ్రహ్మాస్మి’ పోస్టర్ పెట్టి, దీని గురించి అడిగితే ఆన్సర్ లేదు అంటూ మనోజ్‌ను ట్యాగ్ చేశాడు.
దీనికి కూడా అదే స్మైలీ ఎమోజీ పెట్టాడే తప్ప మనోజ్ ఈ సినిమా గురించి ఏ అప్‌డేట్ ఇవ్వలేదు. మనోజ్ రెస్పాన్స్‌ను బట్టి చూస్తే ఈ సినిమాను ఆపేశారని అర్థమవుతుంది. మేకింగ్ దశలో ఉండుంటే మనోజ్ ఇలా సమాధానం దాటవేసేవాడు కాదు, నవ్వే వాడు కాదు. మరి అది కాకపోయినా వేరేదైనా సినిమా అయినా చేస్తాడా లేక సినిమాలే మానుకుంటాడా మనోజ్?
This post was last modified on December 9, 2022 6:07 pm
తన ప్రియురాలి కోసం చైన్ స్నాచింగ్స్ దొంగగా మారిన ఒక ప్రియుడు... బైకుల మీద స్పీడుగా వెళుతూ మహిళల మెడల…
సంక్రాంతి పండక్కు తెలుగు రాష్ట్రాల థియేటర్లకు ఊహించిన సమస్యే తలెత్తింది. షోలు చాలక ప్రేక్షకుల డిమాండ్ అధికం కాగా దానికి…
వైసీపీలో నిన్న మొన్నటి వరకు పార్టీ ముఖ్య నాయకుడు, మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కేంద్రంగా అనేక విమర్శలు వచ్చాయి.…
భోగి పండుగ రోజు ఉదయాన్నే మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తన ప్రత్యేక ప్రతిభను బయటపెట్టారు. కూటమి ప్రభుత్వాన్ని…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి ప్రశంసలు లభించాయి. గతంలోనూ పలు…
పండుగ అనగానే ఎవరైనా కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఏడాదంతా ఎంత బిజీగా ఉన్నా పండగ పూట.. కొంత సమయాన్ని ఫ్యామిలీకి…