బ్యానర్ ఎంత పెద్దదయినా సినిమా చిన్నది అయినప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తి తక్కువగానే ఉంటుంది. ఒకప్పుడంటే సురేష్ ప్రొడక్షన్స్ లాంటి సంస్థల నుంచి వచ్చే ఏ మూవీ అయినా క్యాస్టింగ్ తో సంబంధం లేకుండా జనాన్ని థియేటర్ల దగ్గరకు తీసుకొచ్చేది. కానీ ఇప్పుడా పరిస్థితులు లేవు.
అయినా కూడా నలుగురు అగ్ర హీరోల మధ్య ఒక మినీ తారని అది కూడా ఓటిటిలో తప్ప బయట పెద్దగా చెప్పుకునే సక్సెస్ లేని సంతోష్ శోభన్ ని దింపడమంటే అది మాములు రిస్క్ కాదు. కానీ యువి క్రియేషన్స్ మాత్రం తగ్గేదేలే అంటోంది. ముందు నుంచి ప్రచారం జరిగినట్టే కళ్యాణం కమనీయంని జనవరి 14 విడుదలకు లాక్ చేసేశారు .
సంక్రాంతికి ఇప్పటికే ఎంత పోటీ ఉందో కళ్లారా చూస్తున్నాం. 12న ఒకే రోజు వీరసింహారెడ్డి, వారసుడులు తలపడుతున్నాయి. ఒక రోజు ఆలస్యంగా 13న వాల్తేరు వీరయ్య దిగుతున్నాడు. అందరికంటే ముందు 11న అజిత్ తెగింపు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే. వీటికే స్క్రీన్లు ఎలా సర్దాలో అర్థం కాక డిస్ట్రిబ్యూటర్లు బుర్రలు బద్దలు కొట్టుకుంటూ ఉంటే విద్యావాసుల అహం ఆల్రెడీ 14 డేట్ తో ఓ పోస్టర్ వదిలేసింది. ఇప్పుడు కళ్యాణం కమనీయంతో మొత్తం కౌంట్ అయిదుకి చేరింది. యువికి స్వంతంగా థియేటర్ చైన్స్ ఉన్నాయి. కాబట్టే ఇబ్బంది ఉండదనే ధీమాతో క్లాష్ కు రెడీ అవుతున్నారు
కానీ దీనికి ఎన్ని తక్కువ కేటాయించినా పైన చెప్పిన నాలుగింటికి ఎంతో కొంత కోత పడినట్టేగా. చాలా జిల్లా కేంద్రాల్లో పట్టుమని పది థియేటర్లు లేని సెంటర్లు ఎన్నో ఉన్నాయి. అక్కడ చిరంజీవి బాలకృష్ణలకు కనీసం రెండు మూడు కేటాయిస్తే తప్ప జనాన్ని కంట్రోల్ చేయలేరు.
అలాంటిది అయిదు రిలీజ్ చేయాలంటే పంపకాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అనిల్ దర్శకుడిగా పరిచయమవుతున్న కళ్యాణం కమనీయంలో కంటెంట్ బాగుండొచ్చు. కానీ అదే సోలో సీజన్ లో వచ్చి ఉంటే ఇంకా మెరుగైన ఫలితం వచ్చి ఉండేది కానీ మరీ ఇంత కాన్ఫిడెన్స్ కి కారణమేంటో చూడాలి
This post was last modified on December 9, 2022 3:20 pm
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…