సౌత్ ఇండియా అనే కాదు.. ఇండియా మొత్ంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది Nayanthara. ఇలాంటి చిత్రాలతో ప్రేక్షకులను థియేటర్లకు పుల్ చేయగల అతి కొద్దిమంది హీరోయిన్లలో ఆమె ఒకరు. ఇప్పటికే పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఆకట్టుకున్న నయన్.. ఇప్పుడు ‘Connect’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇంతకు ముందు Nayanthara ప్రధాన పాత్రలో ‘మాయ’ (తెలుగులో మయూరి) తీసిన అశ్విన్ శరవణన్ ఈ చిత్రానికి దర్శకుడు. తొలి చిత్రంతోనే దర్శకుడిగా చాలా మంచి పేరు సంపాదించిన అశ్విన్.. ఆ తర్వాత తాప్సి ప్రధాన పాత్రలో ‘గేమ్ ఓవర్’ అనే మరో థ్రిల్లర్ తీశాడు.
ఇప్పుడు ‘Connect’ కోసం మళ్లీNayanthara తో జట్టు కట్టాడు. ఇందులో వినయ్ రాయ్, సత్యరాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ నెల 22న సినిమా తమిళం, తెలుగులో రిలీజ్ కానున్న నేపథ్యంలో దీని ట్రైలర్ లాంచ్ చేశారు.
అశ్విన్ తొలి రెండు చిత్రాల్లాగే ఇది కూడా హార్రర్ టచ్ ఉన్న సినిమానే. కాకపోతే ఈసారి అతను విభిన్నమైన ‘లాక్ డౌన్’ నేపథ్యాన్ని ఎంచుకున్నాడు. ఒక కుటుంబంలో అందరూ చాలా హ్యాపీగా ఉన్న టైంలో లాక్ డౌన్ వల్ల ఒక్కొక్కరు ఒక్కో చోట ఉండిపోవడం.. అలాంటి టైంలోనే Nayanthara ఉన్న ఇంట్లో దయ్యం ప్రవేశించడం.. వీడియో కాల్‌లో మాట్లాడుతున్న మిగతా వాళ్లకు దయ్యం సంకేతాలు వినిపించి, కనిపించి కంగారు పడడం ఇలా సాగే కథ ఇది.
మామూలుగా అయితే భూత వైద్యుడిని ఇంటికి పిలిపించి ఏవో విరుగుడు చర్యలు చేపట్టి దయ్యాన్ని బయటికి పంపిస్తారు. కానీ లాక్ డౌన్ కావడంతో ఎవరూ ఎటూ కదిలే పరిస్థితి ఉండదు. ఈ స్థితిలో దయ్యాన్ని తరిమేయడానికి నయన్, ఆమె ఫ్యామిలీ ఏం చేసిందన్నదే ఈ సినిమా.
ఇంటర్వెల్ లేకుండా 90 నిమిషాల పాటు నాన్‌స్టాప్‌గా నడుస్తుందట ఈ చిత్రం. కాన్సెప్ట్‌తో పాటు టెక్నికల్‌గా బ్రిలియంట్ అనిపించింది ట్రైలర్ వరకు చూస్తే. మరి సినిమాగా ‘కనెక్ట్’ ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.
This post was last modified on December 9, 2022 10:55 am
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……