సోషల్ మీడియా మొత్తం తేరి రీమేక్ వద్దనే ట్రెండ్ తో ఊగిపోతోంది. ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా ఇంకొద్ది గంటల్లో పవన్ కళ్యాణ్ తో కొత్త సినిమా అప్డేట్ వింటారని దర్శకుడు హరీష్ శంకర్ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే ఈ రచ్చ మొదలై గంటల తరబడి కొనసాగుతోంది. నిజానికి తాము తీయబోయేది తేరి రీమేక్ అని ఎవరూ బాహాటంగా చెప్పలేదు. కానీ మైత్రి దగ్గరే హక్కులున్న సంగతి అందరికీ తెలుసు. భవదీయుడు భగత్ సింగ్ ఇప్పట్లో తెరకెక్కే ఛాన్స్ లేదు కాబట్టి ఆ స్థానంలో తేరిని దించుతున్నారని వందలు వేలల్లో నిరసన ప్రకటిస్తూ అభిమానులు పోస్టులు మీమ్స్ పెడుతున్నారు.
వాళ్ళ ఆవేదనలో అర్థం లేకపోలేదు. తేరి దాని ఒరిజినల్ వెర్షన్ రిలీజ్ టైంలోనే మనకు పోలీసోడిగా థియేటర్లో వచ్చింది. కానీ ఫ్లాప్ అయ్యింది. శాటిలైట్ ఛానల్ లో ఇప్పటికి వారానికి రెండు మూడు సార్లు వస్తూనే ఉంటుంది. ప్రైమ్ లో హెచ్డి ప్రింట్ ఎప్పటి నుంచో అందుబాటులో ఉంది. ఇలా రకరకాల రూపాల్లో ఈ పోలీసోడిని జనం చూస్తూనే ఉన్నారు. అలాంటి కథను తీసుకుని మళ్ళీ తీస్తామంటే కాలకుండా ఉంటుందా. ఇదే కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ కూడా రీమేకే కానీ దానికి హరీష్ శంకర్ బోలెడు మసాలా మార్పులు చేసి బ్లాక్ బస్టర్ అందించారు. అప్పుడు దబాంగ్ చూసినవాళ్లు తక్కువ.
దెబ్బకు మైత్రి హ్యాండిల్ నుంచి ఎలాంటి సమాచారం రావడం లేదు. లేట్ అయినా రాత్రి లోపు పెడతారో లేక రేపు ప్లాన్ చేసుకున్నారో తెలియదు. పోనీ తేరి రీమేక్ కాదనుకున్నప్పుడు అదేదో హరీష్ శంకర్ నేరుగా చెప్పేస్తే ఈ గొడవే ఉండదు. కానీ తనూ సైలెంట్ గా ఉండటం అనుమానాలను నిజం చేస్తోంది. తేరి నిజంగా ఒక రొటీన్ పోలీస్ స్టోరీ. విజయ్ ఇమేజ్ తో తమిళంలో ఆడేసింది కానీ మనం బోలెడు చూశాం కాబట్టే ఇక్కడ డిజాస్టర్ చేశాం. ఎంత పవన్ అయినా కాటమరాయుడు, గోపాల గోపాల, భీమ్లా నాయక్ లాంటి రీమేక్ లు అద్భుతాలు చేయలేదుగా. అలాంటప్పుడు తేరితో రిస్క్ చేయడం ఎందుకు.
This post was last modified on December 8, 2022 9:58 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…