మూడు వరుస డిజాస్టర్ల తర్వాత ‘అఖండ’తో బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు నందమూరి బాలకృష్ణ. అదే సమయంలో ‘అన్‌స్టాపబుల్’ షో సూపర్ హిట్ అయి ఆయన క్రేజ్‌ను పెంచింది. ఇప్పుడు బాలయ్య కొత్త చిత్రం ‘వీరసింహారెడ్డి’ మంచి హైపే కనిపిస్తోంది. కొత్తగా అనిల్ రావిపూడి లాంటి క్రేజీ డైరెక్టర్‌తో బాలయ్య సినిమాను మొదలుపెట్టేశాడు. మొత్తంగా బాలయ్య విషయంలో ఆల్ హ్యాపీస్ అన్నట్లుంది. కెరీర్లో ఈ దశలో మళ్లీ ఇలాంటి పీక్ చూస్తాడని అభిమానులు ఊహించలేదు.
ఐతే అంతా బాగుందనుకుంటున్న సమయంలో బాలయ్య కొత్త సినిమా గురించి మొదలైన చర్చ అభిమానులను కలవరపెడుతోంది. ఆ చిత్రం.. రామానుజాచార్యుల జీవిత కథ అని అంటున్నారు. సీనియర్ నిర్మాత సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించడానికి రెడీ అవుతున్నారు. ఒక ఇంటర్నేషనల్ కంపెనీ ఈ ప్రాజెక్టులో భాగం కానున్నట్లు కూడా ఆయన వెల్లడించారు.
కానీ ఎంత పెద్ద కంపెనీ భాగస్వామి అయినా.. ఎన్ని భాషల్లో తీసినా.. ఎంత బడ్జెట్ పెట్టినా.. బాలయ్య లాంటి మాస్ హీరోను ఆధ్యాత్మిక చిత్రంలో చూడడానికి అంతగా ఇష్టపడరన్నది వాస్తవం. ఈ తరహా చిత్రాలకు మంచి పేరొస్తుంది కానీ.. డబ్బులు రావు. కమర్షియల్‌గా వర్కవుట్ అయ్యే సినిమాలు కావివి. అందులోనూ సి.కళ్యాణ్ ట్రాక్ రికార్డు కూడా బాలయ్య అభిమానులను భయపెట్టేదే.
ఒకప్పుడు ‘సింహా’తో బాలయ్య మళ్లీ ఫాం అందుకుని ఉత్సాహంగా ఉన్న టైంలో ‘పరమవీర చక్ర’ లాంటి ఆల్ టైం డిజాస్టర్ ఇచ్చిన నిర్మాత కళ్యాణే. పూర్తిగా టచ్ కోల్పోయిన దాసరి నారాయణ రావుతో ఈ సినిమా తీయించి బాలయ్యకు చేదు అనుభవాన్ని మిగిల్చారు. ఇక ‘లెజెండ్’తో మళ్లీ ఫాం అందుకున్నాక మళ్లీ బాలయ్యను ట్రాక్ తప్పించింది కూడా కళ్యాణే. కె.ఎస్.రవికుమార్ లాంటి మరో ఔట్ డేట్ డైరెక్టర్ని పెట్టి బాలయ్యతో ‘జైసింహా’, ‘రూలర్’ లాంటి సినిమాలు తీశాడు కళ్యాణ్. ఇందులో ‘జై సింహా’ పర్వాలేదనిపించింది కానీ.. ‘రూలర్’ పెద్ద డిజాస్టర్ అయింది. తనతో ఇలాంటి సినిమాలు తీసిన కళ్యాణ్‌ను నమ్మి, బాలయ్య ఒక ఆధ్యాత్మిక చిత్రం చేస్తానంటే అభిమానులు అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు.
This post was last modified on December 8, 2022 9:37 pm
ది రాజా సాబ్ ఫలితం గురించి మళ్ళీ చెప్పడానికి ఏం లేదు. ఏదైనా డిఫెండ్ చేసుకుందామన్నా ఆ అవకాశం లేకపోవడంతో…
సంక్రాంతి వచ్చిందంటే చాలు ఉభయ గోదావరి జిల్లాల్లో పచ్చటి పొలాలు..గొబ్బిళ్లు…కళ్లాపి జల్లి రంగురంగుల ముగ్గులు వేసిన లోగిళ్లు…వాటితో పాటు కోడి…
ఎవరెవరి దగ్గరికో వెళ్లి ఎన్నో నెరేషన్లు జరుపుకున్న ఎల్లమ్మ చివరికి దేవిశ్రీ ప్రసాద్ తెరంగేట్రానికి ఉపయోగపడటం ఎవరూ ఎక్స్ పెక్ట్…
కారుణ్య మరణం…వైద్యం చేసినా బ్రతికే అవకాశం లేక చావు కోసం ఎదురు చూసే పేషెంట్ల కోసం వారి కుటుంబ సభ్యులు…
సాధారణంగా జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య స్నేహ భావమే ఉంటుంది. ఆ ఇద్దరు హీరోలు ఒకరినొకరు బావా…
మెగాస్టార్ చిరంజీవి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికీ ఎలాంటి విధ్వంసం సృష్టించగలరో ‘మన శంకర వరప్రసాద్…