యుఎస్ తెలుగు ఆడియన్స్ టేస్టుకు చాలా దగ్గరగా ఉండే సినిమాలు చేసే హీరోల్లో అడివి శేష్ ఒకడు. క్షణం దగ్గర్నుంచి అతడి ప్రతి సినిమా యుఎస్‌లో బాగా ఆడుతోంది. ఐతే స్టార్ ఇమేజ్ లేకపోవడం వల్ల ఇంతకుముందు శేష్ సినిమాలు భారీ వసూళ్లు సాధించలేకపోయాయి కానీ.. లేదంటే క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్ సినిమాలు మిలియన్ డాలర్ల క్లబ్బులోకి చేరాల్సినవే.
ఐతే ‘మేజర్’ టైంకి శేష్ ఇమేజ్ కొంచెం పెరిగి 8 లక్షల డాలర్లకు పైగా కలెక్ట్ చేసింది. ఐతే ‘హిట్-2’ సినిమాకు ఉన్న హైప్ చూస్తే.. పాజిటివ్ టాక్ వస్తే ఇది శేష్‌కు తొలి మిలియన్ డాలర్ మూవీగా నిలవడం ఖాయం అనుకున్నారు. ప్రి రిలీజ్ హైప్ బాగుండడం.. తొలి రోజు టాక్ కూడా బాగుండడంతో అంచనాలకు తగ్గట్ల యుఎస్ బాక్సాఫీస్‌లో దూసుకెళ్లింది ‘హిట్-2’. ప్రిమియర్లతోనే 2 లక్షల డాలర్లకు పైగా కలెక్ట్ చేసిన ఈ చిత్రం వీకెండ్ అయ్యేసరికి 6 లక్షల డాలర్ల మార్కును అందుకుంది.
ఆ తర్వాత వీక్ డేస్‌లు వసూళ్లు తగ్గినా.. డ్రాప్ మరీ ఎక్కువేమీ లేదు. మంగళవారానికే ఈ చిత్రం 8.5 లక్షల డాలర్ల దాకా కలెక్ట్ చేసింది. గురువారం మొత్తం షోలు అయ్యేసరికి ఈ సినిమా మిలియన్ డాలర్ల మార్కును అందుకోబోతుండడం లాంఛనమే. ప్రిమియర్లతో కలిపి వారం తిరిగేసరికి ‘హిట్-2’ మిలియన్ డాలర్ల క్లబ్బులోకి అడుగు పెట్టేసింది. ఈ వారం చెప్పుకోదగ్గ రిలీజ్‌లు ఏమీ లేవు. దీంతో రెండో వీకెండ్లో కూడా ‘హిట్-2’ యుఎస్ తెలుగు బాక్సాఫీస్‌ను రూల్ చేయడం గ్యారెంటీ. ఈ నెల 16న ‘అవతార్-2’ వచ్చే వరకు ‘హిట్-2’కు ఎదురు లేనట్లే.
ఫుల్ రన్లో ఈ సినిమా 1.5 మిలియన్ మార్కును కూడా టచ్ చేసే అవకాశాలున్నాయి. ‘హిట్-2’ ఓవరాల్ వసూళ్లు రూ.20 కోట్ల షేర్ మార్కుకు దగ్గరగా ఉన్నాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని హిందీ, తమిళ భాషల్లోనూ రిలీజ్ చేయబోతున్నారు. అక్కడా సినిమా మంచి సక్సెస్ అయ్యే అవకాశాలున్నాయి.
This post was last modified on December 8, 2022 5:39 pm
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీ క్లిన్ స్వీప్ చేయాలి. ఆ దెబ్బతో గొడ్డలి పార్టీ మూత పడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు…
ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగిపోవాలని పెద్దలు అంటారు. పెళ్లి, పిల్లలు ఏదైనా సరే ఏజ్ బార్…
సినిమా కుటుంబాల నుంచి వారసులు ఇండస్ట్రీలోకి రావడం చాలా మామూలు విషయం. ఐతే ఒక కుటుంబంలో తండ్రి హీరోగా, తల్లి…
గత ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను పనిచేశాను. స్థానిక ఎన్నికలు మీ భవిష్యత్తు. మీ అవసరాల కోసం. అందుకే…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం తమిళనాడులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. అయితే..…
తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…