సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ నుంచి మలైకా అరోరా విడిపోతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఎందుకంటే సినిమాల్లో మలైకా పెద్ద పేరు సంపాదించకపోయినా.. బాలీవుడ్లో ఓ పెద్ద కుటుంబానికి కోడలైంది. అర్బాజ్‌తో కలిసి దశాబ్దంన్నర పాటు అన్యోన్యంగా వైవాహిక జీవితం సాగించింది. వాళ్లిద్దరి పిల్లలు కూడా పెరిగి పెద్దవాళ్లవుతున్న తరుణంలో ఆమె భర్త నుంచి విడిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
దీనికి మించిన షాక్ ఏంటంటే.. తనకంటే పన్నెండేళ్లు చిన్నవాడైన యువ కథానాయకుడు అర్జున్ కపూర్‌తో మలైకా కొత్త బంధం మొదలుపెట్టడం. ఐదారేళ్ల నుంచి అతడితోనే సహజీవనం చేస్తున్న మలైకా.. తన మాజీ భర్త గురించి ఇప్పటికీ చాలా పాజిటివ్‌గానే మాట్లాడుతుండడం విశేషం. తమ దారులు వేరు కావడంతో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది కానీ.. అర్బాజ్ చాలా మంచోడని, తనంటే అతడికి చాలా ప్రేమ అని ఆమె ఒక షోలో వెల్లడించింది.
అర్బాజ్‌కు మొదట ప్రపోజ్ చేసింది కూడా తనేనని ఈ షోలో మలైకా వెల్లడించడం విశేషం. ఇప్పటివరకు ఎవరికీ తెలియని విషయం ఏంటంటే.. అర్బాజ్‌కు మొదట ప్రపోజ్ చేసింది నేనే. నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఉంది, మీరు సిద్ధంగా ఉన్నారా అని తనే అతణ్ని అడగ్గా.. అర్బాజ్ వెంటనే ఒప్పకున్నాడు. ఐతే జీవితంలో మేం విభిన్న అంశాలను కోరుకోవడంతో విడిపోయాం. కానీ ఆయన ఎంతో మంచి వ్యక్తి. నన్ను ఎంతో మార్చాడు. ఈ రోజు నేనిలా ఉన్నానంటే ఆయనే కారణం.
ఇంకా అర్బాజ్‌కు నా మీద ప్రేమ తగ్గలేదు. ఇటీవల నాకో ప్రమాదం జరిగి ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి రాగానే అక్కడ నా కోసం వేచి ఉన్నాడు అంటూ తన మాజీ భర్తపై ప్రశంసలు కురిపించింది మలైకా. ఇదిలా ఉండగా.. మలైకా త్వరలోనే అర్జున్‌ను పెళ్లాడబోతున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది.
This post was last modified on December 8, 2022 6:39 am
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…