Movie News

సినిమా అనౌన్స్ చేశాడు.. ట్రోల్స్ మొదలు

బాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడైన అక్షయ్ కుమార్‌కు ఈ మధ్య అస్సలు కలిసి రావడం లేదు. గత ఏడాది సుదీర్ఘ విరామం తర్వాత ఉత్తరాదిన పూర్తి స్థాయిలో థియేటర్లు తెరుచుకున్నాక పెద్ద స్థాయిలో రిలీజ్ అయిన ‘సూర్యవంశీ’ సినిమాతోనే బాలీవుడ్ రివైవ్ అయింది. అప్పుడు అందరూ అతణ్ని సేవియర్ అన్నారు. కానీ ఆ ఊపును తర్వాత అక్షయ్ కొనసాగించలేకపోయాడు. ఈ ఏడాది ఒకటి రెండు కాదు.. ఐదు డిజాస్టర్లను అతను ఖాతాలో వేసుకున్నాడు.

థియేటర్లలో రిలీజైన బచ్చన్ పాండే, పృథ్వీరాజ్, రక్షాబంధన్, రామ్ సేతు.. ఓటీటీలో విడుదలైన కట్ పుట్లి అతడికి తీవ్ర నిరాశను మిగిల్చాయి. దీంతో ఒక్కసారిగా అక్షయ్ కుమార్ కెరీర్ ప్రమాదంలో పడ్డట్లు కనిపించింది. స్వయంగా అభిమానులే అతణ్ని డిస్ ఓన్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ పరిస్థితుల్లో ట్రెండుకు తగ్గట్లుగా చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా చేద్దామని ఛత్రపతి శివాజీ కథను లైన్లో పెట్టాడు.

మహేష్ మంజ్రేకర్ దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా నుంచి చిన్న వీడియో గ్లింప్స్‌ను మంగళవారమే రిలీజ్ చేశారు. ఇలా సినిమా అనౌన్స్ అయిందో లేదో కాసేపటికే ట్రోల్స్ మొదలైపోయాయి. ఒక రాజమహల్‌లో అక్షయ్ నడిచి వస్తున్న వీడియోలో వెనుక ట్యూబ్ లైట్లతో కూడిన భారీ జూమర్‌ ఈ ట్రోల్స్‌కు కారణమైంది.

శివాజీ బతికి ఉన్న కాలానికి ప్రపంచంలో ఎక్కడా విద్యుత్ కానీ, ట్యూబ్ లైట్ కానీ లేవు. అప్పటికి థామస్ అల్వా ఎడిసన్ బల్బునే కనిపెట్టలేదు. మరి ఆ కాలంలో సినిమా తీస్తూ ఇప్పటి టెక్నాలజీ జూమర్‌ను ఏర్పాటు చేయడం ఏంటి.. ఈ మాత్రం కామన్ సెన్స్ లేదా అంటూ నెటిజన్లు ఈ చిత్ర బృందాన్ని ట్రోల్ చేస్తున్నారు. అసలే ఈ మధ్య ప్రతి చిన్న విషయానికీ ట్రోల్స్ ఎక్కువ అయిపోతున్నాయి. సినిమాల మీద నెగెటివిటీని పెంచడానికి ఒక వర్గం కాచుకుని ఉంది. ఈ పరిస్థితుల్లో ఒక లోపం కనిపించేసరికి అక్షయ్ సినిమా మీద నెటిజన్లు పడిపోతున్నారు.

This post was last modified on December 7, 2022 8:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

8 hours ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

9 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

10 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

10 hours ago

రిస్కులకు సిద్ధపడుతున్న గోపీచంద్

మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…

10 hours ago

ఫిఫా పోస్టులో ‘NTR’.. స్పందించిన తారక్

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…

11 hours ago