Movie News

త‌మ‌న్నాకు సంబంధాలు చూస్తున్నార‌ట‌

హీరోయిన్లు 30 ప్ల‌స్‌లోకి రాగానే వారి పెళ్లి గురించి చ‌ర్చ మొద‌లైపోతుంది. మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా కూడా అందుకు మిన‌హాయింపు కాదు. ఈ మ‌ధ్య ఆమె వివాహం గురించి ర‌క‌ర‌కాల రూమ‌ర్లు వినిపిస్తున్నాయి. త‌మ్మూ ఒక వ్యాపార‌వేత్త‌ను పెళ్లాడ‌బోతున్న‌ట్లు కొన్ని రోజుల కింద‌ట జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. దీనిపై తమన్నా చాలా ఫన్నీగా స్పందించింది. తనకు సంబంధం చూసి పెట్టినందుకు థ్యాంక్స్ అంటూ మీడియా, సోషల్ మీడియా జనాలకు కౌంటర్ వేసింది.

అలా అని తాను పెళ్లి చేసుకోనని, తన ఇంట్లో ఆ చర్చ ఏమీ లేదని చెప్పట్లేదు తమన్నా. ఇంట్లో తన పెళ్లి గురించిన చర్చ కొంత కాలంగా జోరుగా నడుస్తోందని.. తనకు సంబంధాలు కూడా చూస్తున్నారని తమన్నా వెల్లడించడం విశేషం. తన కొత్త చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన సందర్భంగా పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయం వెల్లడించింది మిల్కీ బ్యూటీ.

“మామూలుగా అందరి ఇళ్లలో అమ్మాయిలకు పెళ్లి చేసే విషయంలో ప్రెజర్ ఉన్నట్లే మా ఇంట్లో కూడా ఎప్పట్నుంచో నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు. ఇంకా చెప్పాలంటే మా ఇంట్లో వాళ్లు నాకు పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు. కానీ నేను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు” అని తమన్నా తెలిపింది. తన వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో వచ్చే రూమర్లు, కామెంట్లపై తమన్నా స్పందిస్తూ.. ‘‘వాటి గురించి నేను పెద్దగా ఆలోచించను. ఇలా రూమర్లు పుట్టించడం, కామెంట్లు చేయడం వారి జీవితంలో భాగం. నటించడం అన్నది మా లైఫ్. సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్‌ను నేనంత సీరియస్‌గా తీసుకోను’’ అని చెప్పింది.

సత్యదేవ్ గురించి మాట్లాడుతూ.. ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’లో తన నటన చాలా సహజంగా అనిపించిందని, అప్పట్నుంచో అతడితో నటించాలని అనుకున్నానని.. ‘గుర్తుందా శీతాకాలం’తో ఆ కోరిక తీరిందని తమ్మూ పేర్కొంది. హీరోల్లో తాను పెద్ద హీరో చిన్న హీరో అని తేడాలు చూడనని.. ఎవరితోనైనా సినిమాను సినిమాలాగే చూస్తానని, కథే ముఖ్యమని తమన్నా అభిప్రాయపడింది.

This post was last modified on December 7, 2022 11:53 am

Share

Recent Posts

నాన్న, అమ్మ, కొడుకు.. ఇప్పుడు కూతురు కూడా

సినిమా కుటుంబాల నుంచి వారసులు ఇండస్ట్రీలోకి రావడం చాలా మామూలు విషయం. ఐతే ఒక కుటుంబంలో తండ్రి హీరోగా, తల్లి…

1 hour ago

టికెట్ల రేట్ల ఎఫెక్ట్ చూశారా?

తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…

10 hours ago

ఇంతకీ అలియాస్ రుక్మిణి ఎవరు?

ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…

12 hours ago

కోన మీద కోపం తగ్గిందా?

కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…

12 hours ago

సామాజిక వ‌ర్గ రాజ‌కీయం క‌లిసొచ్చిందా జ‌గ‌న్‌… ?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఒక‌వైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచ‌న చేస్తామంటే కుదురుతుందా? అంటే కాద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. కానీ,…

12 hours ago

చరణ్ కోసం అనిరుధ్ బెస్ట్ ఇవ్వాల్సిందే

పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…

16 hours ago