Movie News

నారప్పా – ఫ్యాన్స్ కోరిక తీరిందప్పా

కరోనా టైంలో తప్పనిసరి పరిస్థితుల్లో విక్టరీ వెంకటేష్ నారప్పని నేరుగా ఓటిటి రిలీజ్ చేసిన నిర్మాత సురేష్ బాబు దాని వల్ల సేఫ్ గా లాభాలైతే పొందారు కానీ అభిమానులు మాత్రం తమ హీరో మాస్ ర్యాంపేజ్ ని థియేటర్లో చూడలేదని తెగ ఫీలైపోయారు. దాని కోసమే ఎఫ్3 క్లైమాక్స్ లో చిన్న బిట్ పెట్టి మేనేజ్ చేస్తే అభిమానుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. చాలా కాలం తర్వాత వెంకీ చేసిన పక్కా విలేజ్ మాస్ పాత్ర నారప్ప. ధనుష్ అసురన్ ని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల యధాతధంగా తీసినప్పటికీ నారప్పకి డిజిటల్ ఆడియన్స్ నుంచి మద్దతు దక్కి బొమ్మ సూపర్ హిట్ అనిపించుకుంది.

సరే లేట్ అయితే అయ్యిందని మొత్తానికి నారప్పని బిగ్ స్క్రీన్ మీద తీసుకురాబోతున్నారు. డిసెంబర్ 13 వెంకటేష్ పుట్టినరోజుని పురస్కరించుకుని కేవలం ఒక్క రోజు వరల్డ్ వైడ్ థియేట్రికల్ విడుదల చేయబోతున్నారు. సెంటర్ ని బట్టి డిమాండ్ ని బట్టి రెండు నుంచి నాలుగు ఆటల వరకు స్క్రీనింగ్ ఉంటుంది. ఇది మిస్ అయితే మాత్రం మళ్ళీ ఇప్పట్లో చూసే అవకాశం ఉండదు. దృశ్యం 2 కూడా ఓటిటిలోనే వచ్చినప్పటికీ దానికన్నా వెండితెర మీద చూసేందుకు నారప్పనే రైట్ ఛాయస్. త్వరలోనే అధికారిక ప్రకటన ద్వారా పూర్తి వివరాలు చెప్పనున్నారు. నాని వికి ఇలాగే చేశారు కానీ వర్కౌట్ కాలేదు.

రీ రిలీజులు బాగా జోరు మీదున్న టైంలో నారప్పని ఇలా తీసుకురావడం బాగుంది. ఒక రోజు ముందు సూపర్ స్టార్ రజనీకాంత్ బాబాని గ్రాండ్ గా థియేటర్లలో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళనాడులో దీని ఫీవర్ ఓ రేంజ్ లో ఉంది. ఇక్కడ అంత స్పందన ఉండదు కాబట్టి తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఆలోచన చేయలేదు. నెలకు కనీసం అయిదారు రీరిలీజులతో డిస్ట్రిబ్యూటర్లు బాగానే సొమ్ములు చేసుకుంటున్నారు కానీ ఈ క్రమంలో డిజాస్టర్లను కూడా తీసుకురావడం వల్ల మెల్లగా వీటి మీద ఆసక్తి సన్నగిల్లుతోంది. నిజానికి వెంకీ బర్త్ డేకి బొబ్బిలిరాజా లేదా జయం మనదేరా ప్లాన్ చేశారు కానీ ఫైనల్ గా నారప్ప లాక్ అయ్యిందని స్టూడియో టాక్ 

This post was last modified on December 6, 2022 5:04 pm

Share

Recent Posts

ఆస్కార్ వెళ్లేంత గొప్పగా ఉందా ‘గోంధల్’

ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…

30 minutes ago

అవతార్ పోలికంటే అతిశయోక్తి అవుతుందేమో

నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…

33 minutes ago

సాయిరెడ్డి వెంట న‌డిచే రెడ్లు ఉన్నారా?

పార్టీ ఏదైనా.. నాయ‌కుడు ఎవ‌రైనా సొంత సామాజిక వ‌ర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేక‌పోతే.. ప్ర‌జాబ‌లం అయినా…

34 minutes ago

దాయ్‌రాగా మారిన దిశా… బాగా లేటయ్యింది

ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…

4 hours ago

షర్మిల కూతురి పెళ్ళికి జగన్ డుమ్మా ?

వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…

4 hours ago

ప్యారడైజ్ పోటీ నుండి తప్పుకున్న కీర్తి సురేష్

ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…

6 hours ago