పరిశ్రమలో ఒక పెద్ద సక్సెస్ వచ్చినంత మాత్రాన ఆది వరసగా అవకాశాలు తెస్తుందేమో కానీ అనుకోకుండా పడే బ్రేకులను, వచ్చే ఫ్లాపులను ఆపలేదు. ఉప్పెనతో సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న కృతి శెట్టికి 2022 బొత్తిగా కలిసి రావడం లేదు. వరస పరాజయాలు మార్కెట్ ని బాగా ప్రభావితం చేస్తున్నాయి. గత ఏడాది చివరిలో శ్యాం సింగ రాయ్, ఈ సంవత్సరం సంక్రాంతి బంగార్రాజుతో బోణీ బాగానే జరిగింది కానీ ఆ తర్వాత అసలైన బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. అతి తక్కువ టైంలో కోటి దాటిన రెమ్యునరేషన్ మెల్లగా తగ్గే సూచనలు ప్రారంభమయ్యాయి.
రామ్ తో చేసిన ది వారియర్ ఘోరంగా డిజాస్టర్ అయ్యింది. నితిన్ మాచర్ల నియోజకవర్గం అసలు వచ్చిందనే సంగతి కూడా గుర్తు లేనంత దారుణంగా తేడా కొట్టింది. తననే టైటిల్ రోల్ తో డబుల్ ఫోటోలో ఇంద్రగంటి తీసిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అయితే మరీ అన్యాయంగా ఓటిటిలో వచ్చాక కూడా ఎవరూ పట్టించుకోలేదు. సరే కోలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకుందామని సూర్యతో వచ్చిన అవకాశాన్ని ఎగిరి గంతేసి ఒప్పుకుంది. శివ పుత్రుడు ఫేమ్ బాలా దర్శకుడు కావడంతో ఇంకేం పెద్ద బ్రేకే దొరుకుతుందని ఆశ పడింది. కట్ చేస్తే ఇప్పుడది ఏకంగా ఆగిపోయి సూర్య తప్పుకున్నాడు.
వేరొకరితో మొదలుపెట్టే సూచనలు కనిపించడం లేదు. ఒకవేళ బాలా తీస్తానన్నా ఏదో మీడియం రేంజ్ హీరో దొరుకుతాడు తప్ప సూర్య స్టేచర్ ఉన్న స్టార్ అసాధ్యం. అలాంటప్పుడు కీర్తి సైతం డ్రాప్ కావడం మినహా వేరే ఆప్షన్ ఉండదు. ప్రస్తుతం టోవినో థామస్ తో కలిసి అజయంటే రండం మోషణంతో మలయాళం ఎంట్రీ ఇస్తోంది. హీరోయిన్ల కొరత వల్ల పూజా హెగ్డే, రష్మిక మందన్న తర్వాత వాళ్ళను దాటడమే టార్గెట్ గా పెట్టుకున్న కృతి శెట్టి ఈ వరస షాకులు ఇబ్బంది కలిగించేవే. మహేష్ బాబు, రామ్ చరణ్, తారక్, బన్నీలతో నటించే ఆఫర్లు రావాలంటే పెద్ద బ్లాక్ బస్టర్లే పడాలి.
This post was last modified on December 6, 2022 1:28 pm
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…